Anchor Pradeep : పూర్ణ స్థానంలో నందిత శ్వేత.. యాంకర్ ప్రదీప్ తో కొత్త లవ్ ట్రాక్.. డ్యాన్స్ షోనా కామెడీ షోనా..!
Anchor Pradeep : తెలుగు పాపులర్ రియాలిటీ షోలలో ఒకటైన ఢీ డ్యాన్స్ షో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది డాన్స్ షో అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ విషయంలో ఏమాత్రం డోకా ఉండదు. అంతలా ఈ షో అందరిని ఆకట్టుకుంటూ వస్తోంది. అయితే ఢీ షో పేరు వినగానే.. డాన్స్ కంటే ముందు యాంకర్ సుధీర్ – రష్మీల జంటనే గుర్తొస్తుంది. సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీలే ఈ షోకి మెయిన్ ఎస్సెట్ అని చెప్పుకోవటంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అధిక శాతం ప్రేక్షకులు..డా ఈ షోలో డాన్స్ చూడటం కంటే సుధీర్ – రష్మీల కెమిస్ట్రీ, కామెడీ చూసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
ఇప్పటికి 13 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు పద్నాలుగో సీజన్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ కొత్త సీజన్‌కు చాలానే మార్పులు చేర్పులు చేశారు. షో కు మెయిన్ పిల్లర్లుగా నిలిచిన.. సుధీర్, రష్మీ, పూర్ణ, దీపిక పిల్లిని షో నుంచి తప్పించారని టాక్ నడుస్తోండగా.. పూర్ణ స్థానంలో మరో హీరోయిన్‌ను పట్టుకొచ్చారు. ఇదే ఇప్పుడు షో రేటింగ్స్ పై ప్రతికూల ప్రభావం చూపిస్తుందేమొనన్న అనుమానాలను వ్యక్తం చేస్తోంది.షో లో సుధీర్ రష్మీ ట్రాక్ సక్సెస్ అవ్వగానే.. యాంకర్ ప్రదీప్ తో కలిసి పూర్ణ తో మరో ట్రాక్ నడిపించింది ఢీ యాజమాన్యం.

Nanditha Swetha replaced poorna in dhee show and she starts love track with anchor pradeep
Anchor Pradeep : నందితాతో యాంకర్ ప్రదీప్ కొత్త లవ్ ట్రాక్..:
అయితే ఈ జంట వారంతా మాదిరిగా కాకపోయినా ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. ఇప్పుడు పూర్ణ స్థానంలో వచ్చిన నందిత శ్వేతతో వచ్చీ రాగానే ప్రదీప్‌తో ట్రాక్‌ను కలిపేందుకు ట్రై చేస్తున్నారు. నందితా కూడా కొత్త పాత లేకుండా స్క్రిప్ట్ ప్రకారం.. ప్రదీప్ కు ఐ లవ్యూలు చెబుతోంది. తెగ సిగ్గుపడుతోంది.డ్యాన్సులు వేస్తోంది. నానా హంగామా చేస్తోంది. అయితే ఈ యవ్వారం ఇప్పుడు బెడిసి కొట్టినట్లు కనబడుతోంది.ఇదిలా ఉండగా షో లో ప్రధాన జడ్జిగా కొనసాగుతున్న ప్రియమణి, హైపర్ ఆదిలు మరింత హద్దు మీరుతున్నట్లు కనిపిస్తోంది. ప్రియమణితో బ్రేకప్ అయిందంటూ ఆది చెప్పడం.. అఖిల్ సార్ధక్, రవి కృష్ణలు ప్రియమణి హగ్గులివ్వడం షో పై ఇంట్రెస్ట్ పోయేలా చేస్తోంది.