Bigg Boss Telugu 7 : ఈ వారం శోభా శెట్టి కాదు.. నయని పావని ఔట్.. ఈవారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. హౌస్‌లోకి శుభశ్రీ ఎంట్రీ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Telugu 7 : ఈ వారం శోభా శెట్టి కాదు.. నయని పావని ఔట్.. ఈవారం ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. హౌస్‌లోకి శుభశ్రీ ఎంట్రీ

 Authored By kranthi | The Telugu News | Updated on :15 October 2023,12:00 pm

Bigg Boss Telugu 7 : ఈ వారం ఎలిమినేషన్ లో అనుకోని ట్విస్ట్. చాలామంది ఈ వారం శోభా శెట్టిని ఎలిమినేట్ చేయాలని అనుకున్నారు. చాలామంది తనకు ఓట్లు కూడా వేయలేదు. మొదటి వారం నుంచి శోభా శెట్టి చేసే హడావుడి మామూలుగా లేదు. రచ్చ రచ్చ చేసింది. ప్రతి చిన్న విషయాన్ని శోభా శెట్టి పెద్దదిగా చేసి ఇరిటేషన్ తెప్పించింది ప్రేక్షకులకు. అందుకే ఈ వారం నామినేషన్ లోకి వచ్చిన శోభా శెట్టిని ఎలాగైనా ఎలిమినేట్ చేయాలని ప్రేక్షకులు భావించారు. కానీ.. ఈ వారం అనూహ్యంగా కొత్తగా హౌస్ లోకి వచ్చిన నయని పావనిని బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడు. అందమైన అమ్మాయిని ఎందుకు బిగ్ బాస్ ఎలిమినేట్ చేశాడో కానీ.. ఇదైతే పక్కా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని బిగ్ బాస్ అభిమానులు అంటున్నారు. ఆమె వచ్చి వారం కూడా కాలేదు. అప్పుడే తన ఆటను ఎలా డిసైడ్ చేస్తారు అని అంటున్నారు. ఇది కావాలని చేసిన ఎలిమినేషనా? లేక నిజంగానే తనకు తక్కువ ఓట్లు వచ్చాయా అనేది తెలియదు.

ఇక.. నయని పావనిని పంపించి.. హౌస్ లోకి శుభశ్రీని పంపించనున్నాడు బిగ్ బాస్. మూడు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉండి వెళ్లిన రతిక, దామిని, శుభశ్రీలో శుభశ్రీ కావాలని హౌస్ మెట్స్ కోరుకున్నట్టు తెలుస్తోంది. దీంతో శుభశ్రీని మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి పంపించినట్టు తెలుస్తోంది. ఎక్కువమంది శుభశ్రీనే కోరుకోవడంతో శుభశ్రీ ఎంట్రీ.. అటు నయని పావని ఎలిమినేషన్ ఒకేసారి జరిగినట్టు తెలుస్తోంది. చివరి వరకు సస్పెన్స్ గా ఉంచి లాస్ట్ కు నయని పావనిని ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి శోభాశెట్టితో పాటు సందీప్ మాస్టర్ ను కూడా ఎలిమినేట్ చేయడానికి ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. కానీ.. స్టార్ మా బ్యాచ్ ను మాత్రం బిగ్ బాస్ అస్సలు ఎలిమినేట్ చేయడం లేదు.

 

nayani pavani eliminated from bigg boss telugu 7

Bigg Boss Telugu 7 : ఇంటి కెప్టెన్ అయిన యావర్.. మారిన క్యారెక్టర్

మరోవైపు యావర్ ఇంటి కెప్టెన్ అయ్యాడు. కెప్టెన్ అయ్యాడో లేదో వెంటనే తన క్యారెక్టర్ ను మార్చుకొని అందరిపై తన ప్రతాపం చూపిస్తున్నాడు. అది ఇంటి సభ్యులకు అస్సలు నచ్చడం లేదు. కొందరైతే నువ్వు కెప్టెన్ కాగానే మారిపోయావు యావర్ అంటూ మండిపడుతున్నారు. మరోవైపు యావర్ తిండిపై కూడా హౌస్ లో ప్రతి రోజు డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే యావర్ అన్నం తినడు. రోటీలు మాత్రమే తింటాడు. అతడు ఒక్కడి కోసం రోటీలు చేయడం హౌస్ మెట్స్ కు ఇబ్బందిగా మారుతోంది. ఏది ఏమైనా.. ఈ వారం నయని పావనిని బిగ్ బాస్ ఇంటికి పంపించేశాడు. శుభశ్రీని మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చాడు.

YouTube video

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది