Trisha: స్టార్ హీరోయిన్ వారికోసం త్రిష ప్రత్యేక పూజలు చేసిందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trisha: స్టార్ హీరోయిన్ వారికోసం త్రిష ప్రత్యేక పూజలు చేసిందా..?

 Authored By govind | The Telugu News | Updated on :23 August 2021,10:23 am

Trisha: త్రిష ..సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతోంది. ఆ మధ్య తన కెరీర్ అయిపోయిందని ఇటు టాలివుడ్ ప్రేక్షకులు అటు కోలీవుడ్ ప్రేక్షకులు చెప్పుకున్నారు. కానీ విజయ్ సేతుపతితో కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ సినిమా 96తో భారీ హిట్ అందుకొని కం బ్యాక్ అయింది. 96 సినిమా హిట్ తో మళ్ళీ త్రిష చేతిలో 6 ప్రాజెక్ట్స్ వచ్చి పడ్డాయి. తెలుగులో త్రిష చేయాల్సిన ఆచార్య కొన్ని కారణాల వల్ల చేజారిపోయింది. అయినా తన ఫ్యూచర్ కి ఇప్పుడు నష్టమేమీ లేదంటోంది. తెలుగులో ఒక్క ఆఫర్ లేకపోయినా తమిళంలో మాత్రం ఈ సీనియర్ హీరోయిన్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు.

is trisha done special pooja for them

is trisha done special pooja for them

భారీ కమర్షియల్ ప్రాజెక్ట్స్ చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కమిటవుతోంది. ప్రస్తుతం త్రిష కోసం టాలీవుడ్ మేకర్స్ కూడా ట్రై చేస్తున్నారని సమాచారం. ఇప్పటికేసీనియర్ హీరోలందరితోనూ నటించిన త్రిష ప్రస్తుతం ఉన్న డిమాండ్ ని బట్టి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ లాంటి టాలీవుడ్ సీనియర్ స్టార్స్ కి మంచి ఛాయిస్ లా మారింది. ఇక వెబ్ సిరీస్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో ఓ పాన్ ఇండియన్ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆ సినిమానే పొన్నియన్ సెల్వన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ మీద విపరీతంగా బజ్ క్రియేటయింది. ఇది లెజండరీ డైరెక్టర్ మణి రత్నం డ్రీం ప్రాజెక్ట్.

Trisha : డైరెక్టర్ మణి రత్నం కోసం త్రిష మధ్యప్రదేశ్‌ లోని ఓ గుడిలో ప్రత్యేక పూజలు

is trisha done special pooja for them

is trisha done special pooja for them

ఓ నవల ఆధారంగా ప్రీయాడికల్ బ్యాక్ డ్రాప్ లో మణిరత్నం ఎంతో ప్రత్యేక చిత్రంగా తీర్చిదిద్దుతున్నారు. రెండు భాగాలుగా రానున్న పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం, డైరెక్టర్ మణి రత్నం కోసం త్రిష మధ్యప్రదేశ్‌ లోని ఓ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారట.

ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా కాలంగా మణి రత్నంకి హిట్ దక్కలేదు. అందుకే ఆయనకి పొన్నియన్ సెల్వన్ మంచి హిట్ సాధించాలని త్రిష కాంక్షిస్తూ పూజా జరిపించారట. కాగా ఈ సినిమాలో ఐశ్వర్యా రాయ్, త్రిష, కార్తీ, విక్రమ్, ‘జయం’రవి, ఐశ్వర్యా లక్ష్మీ, శరత్‌ కుమార్, పార్తీబన్‌ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది