Dhee 14 : డ్యాన్స్ షోను కామెడీ షోగా మార్చారు కదరా అయ్యా.. పరువుతీస్తోన్న నెటిజన్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dhee 14 : డ్యాన్స్ షోను కామెడీ షోగా మార్చారు కదరా అయ్యా.. పరువుతీస్తోన్న నెటిజన్లు

 Authored By aruna | The Telugu News | Updated on :12 August 2022,4:20 pm

Dhee 14 : బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ అంటే ఎలా ఉంటుందో, దాని అర్థాన్ని ఎలా మార్చారో అందరికీ తెలిసిందే. డ్యాన్స్ షోలో డ్యాన్స్ తక్కువ.. పాటల షోలో పాటలు పాడటం తక్కువ. కానీ అన్నింట్లో కామెడీ మాత్రం కామన్. వాళ్లు ఎవరు.. ఎవరితో ఏం చేయించాలి.. ఎవరు ఏం చేయాలనే హద్దులు మాత్రం ఎవ్వరూ పెట్టుకోవడం లేదు. చివరకు కథ ఎక్కడి వరకు వచ్చిందంటే.. అన్ని రకాల షోలను కామెడీ షోలుగా మార్చేశారు. తాజాగా వదిలిన ఢీ ప్రోమో కూడా ఇలాంటిదే. ఢీ షోలో డ్యాన్సర్లు తక్కువ. కామెడీ చేసే వాళ్లు ఎక్కువ. ఢీ షోకు సంబంధం లేని వాళ్లు ఎక్కువగా ఉంటారు. ఆది, నవ్యస్వామి, రవికృష్ణ, పూర్ణ, ప్రియమణి, శ్రద్దా దాస్, అఖిల్ సార్థక్ ఇలాంటి వారేఎక్కువగా కనిపిస్తున్నారు..

ఇక ఆది వేసే పంచులు, ప్రదీప్ చేసే కామెడీ, జానీ మాస్టర్ వేషాలు, హీరోయిన్ల ముద్దులు, హగ్గులు వెరసీ ఢీ షో కాస్త కలగపులగంలా మారిపోయింది. తాజాగా వదిలిన ప్రోమో అయితే మరీ దారుణంగా తయారైనట్టు అనిపించింది. డ్యాన్సర్ల మీద చెత్త కామెడీలు చేయడం, కప్పులు కడుక్కునే వారు కప్పు కొడతారా? అంటూ ఆది గేలిచేయడం, అందరూ పళ్లు ఎకిలించి నవ్వడం ఏంటో.. అఖిల్ సార్థక్‌ను మళ్లీ తీసుకోవడం ఏంటో.. అతనితో పిచ్చి స్కిట్లు వేయించడం, ఆది కౌంటర్లు వేయడం ఇవన్నీ చూస్తుంటే..

Netizens Satires on Dhee 14 Show Funny Skits

Netizens Satires on Dhee 14 Show Funny Skits

అది అసలు ఢీ షోనా? కామెడీ షోనా? అన్నది అర్థం కావడం లేదంటూ కౌంటర్లు వేస్తున్నారు. మొత్తానికి ఢీ షో మాత్రం గాడి తప్పిందని అర్థమవుతోంది. ఒకప్పుడు ఢీ షోకి ఉన్న ఇమేజ్ ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఢీ షోకు, అందులో వేసే డ్యాన్సులకు అందరూ ఫిదా అవుతుండేవారు. అయితే రాను రాను అందులో డ్యాన్సులు తగ్గి, దాన్ని ఒక కామెడీ షోగా మార్చేశారు. ఇప్పుడు ఇదే అందరికీ టార్గెట్ అయింది. డ్యాన్స్ షోను కామెడీ షోగా మార్చేశారు కదా? అంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది