Nidhi Agarwal : గుట్టు చప్పుడు కాకుండా నిధి అగర్వాల్ పెళ్లి.. అందరు ఓకే అన్నట్టేనట..!
Nidhi Agarwal : ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అందరిదృష్టి ఆకర్షించిన అందాల ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన సవ్యసాచి అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పటికీ సరైన హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఇప్పటికే తెలుగులో అనేక సినిమాలు ఈ భామ చేసింది కానీ ఒక్క సినిమా కూడా ఈ భామకు మంచి పేరు అయితే తెచ్చిపెట్టలేదు. ప్రస్తుతానికి ఈ భామ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం దక్కించుకుని జాక్పాట్ కొట్టింది. గత కొన్ని రోజులుగా ఈ ముద్దుగుమ్మ శింబు ప్రేమాయణంతో వార్తలలో నిలుస్తుంది.
కోలీవుడ్‌లో చాలా క్రేజ్ ఉన్న హీరోల్లో శింబు కూడా ఒకడు. అతడిని ముద్దుగా అక్కడ లవర్ బాయ్ అని కూడా పిలుచుకుంటారు. ఆన్ స్క్రీన్‌తో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా కూల్‌గా కనిపించే శింబు లైఫ్‌లో చాలా ప్రేమకథలే ఉన్నాయి. అంతే కాక వాటి వల్ల తాను చాలా ట్రాజెడీ కూడా ఎదుర్కున్నాడు. ఫైనల్‌గా శింబు ఇక పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎవరినో కాదు ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ని. తాజా సమాచారం ప్రకారం ఈ లవ్‌బర్డ్స్ ఈ ఏడాదే పెళ్లి చేసుకోనున్నారని, త్వరలోనే తమ వివాహ తేదీని అఫీషియల్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇప్పటికే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారని తెలుస్తుంది.

nidhi agarwal marriage update
Nidhi Agarwal : త్వరలోనే పెళ్లి..
ప్రస్తుతం తెలుగులో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్న నిధి షూటింగ్ పూర్తయిన వెంటనే పెళ్లిపీటలు ఎక్కేందుకు ప్లాన్ చేస్తుందట.కాగా ఈశ్వరన్ సినిమా ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నిధి ఆ సినిమా సమయంలోనే శింబుతో ప్రేమలో పడిపోయిందట. ఆ వ్యవహారం కాస్త పెళ్లి వరకు వెళ్లిందని, ఇప్పటికే నిధి టి నగర్‌లోని శింబు ఇంటికి మకాం మార్చినట్లు కోలీవుడ్ టాక్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది నిథి అగర్వాల్. తన అందాలతో కుర్ర కారకు ఎప్పుడూ ఎరవేస్తూనే ఉంటుంది. తన ఫాలోవర్స్ కు మతిపోయేలా ఫోజులిస్తూ.. ఫోటోలను అప్ లోడ్ చేస్తుంది. కుర్ర కారకు వెర్రెక్కిస్తుంది.