Niharika Konidela : నిహారిక కొణిదెల .. కొత్త ఫోటోలతో ఎవ్వరైనా మైమరచిపోవాల్సిందే !

 Authored By prabhas | The Telugu News | Updated on :29 March 2023,11:00 am

Niharika Konidela : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతి ఒక్కరు తమ అప్డేట్స్ షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలామంది హీరోయిన్స్ తమ లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తున్నారు. లక్షలు ఖర్చు చేసి మరి ఫోటో షూట్లు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇక ఇటీవల మెగా డాటర్ నిహారిక కొణిదెల విడాకుల గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక నిహారిక హీరోయిన్ గా సినిమాలలో ఎంట్రీ ఇచ్చిన అంతగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఫ్యామిలీ జొన్నలగడ్డ చైతన్యను ఇచ్చి వివాహం చేశారు.

Niharika Konidela latest look photos goes viral

Niharika Konidela latest look photos goes viral

అయితే గత కొద్దికాలంగా ఈ జంట కలిసి కనిపించడం లేదు.అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ లో కూడా ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. అలాగే చైతన్య పెళ్లి ఫోటోలను డిలీట్ చేశాడు. దీంతో వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక ఈ విషయం గురించి స్పందించలేదు. అయితే విడాకులకు సంబంధించిన న్యూస్ వస్తున్నా్ నిహారిక తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చారు. తాజాగా నిహారిక బ్లాక్ అండ్ వైట్ లో లంగా ఓణీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వింటేజ్ లుక్ లో కిల్లింగ్ ఫోజులతో ఉన్న నిహారిక ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Niharika konidela latest look photos goes viral

Niharika konidela latest look photos goes viral

అయితే నిహారిక ఈ ఫోటోలు ఏదైనా సినిమా కోసం చేసిందా లేదా సాధారణంగా ఫోటో షూట్ లు చేసి పోస్ట్ చేసిందా అనేది తెలియదు. ఏది ఏమైనా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు చూసిన చాలామంది నిహారిక విడాకులకు సంబంధించిన వార్తలను షేర్ చేస్తున్నారు. అయినా నిహారిక విడాకుల విషయంపై ఏమాత్రం స్పందించడం లేదు. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నిహారిక తన విడాకుల గురించి వస్తున్న వార్తలపై స్పందించవచ్చు కదా నెటిజన్స్ భావిస్తున్నారు. ఏదేమైనా నిహారిక బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో లంగా వోణిలో అందరిని మెస్మరైజ్ చేస్తుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి