నితిన్ - కీర్తి సురేష్ ఇంత రొమాంటిక్ గా ఉన్నారేంటి యూత్ తట్టుకోలేరు ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

నితిన్ – కీర్తి సురేష్ ఇంత రొమాంటిక్ గా ఉన్నారేంటి యూత్ తట్టుకోలేరు ..?

 Authored By govind | The Telugu News | Updated on :2 January 2021,2:00 pm

నితిన్ – కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రంగ్ దే. బీష్మ సినిమా తర్వాత నితిన్ నుంచి వస్తున్న రంగ్ దే సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగాలనుకున్న ఈ సినిమా పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటున్న రంగ్ దే సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన రొమాంటిక్ పోస్టర్స్, కీర్తి సురేష్, నితిన్ పోస్టర్స్ యూత్ ఆడియన్స్ ని బాగా అట్రాక్ట్ చేశాయి.

Emito Idhi Lyrical | Rang De Songs | Nithiin, Keerthy Suresh | Venky Atluri  | DSP - YouTube

అలాగే దేవీశ్రీప్రసాద్ సంగీతమందిస్తుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన లిరికల్ వీడియే సాంగ్ సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చింది. ఫస్ట్ టైం నితిన్ – కీర్తి సురేష్ జంట అందరికీ ఆకట్టుకుంటుండగా కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా రంగ్ దే రూపొందుతోంది. ఇందుకు సంబంధించిన రొమాంటిక్ టీజర్ తాజాగా రిలీజై యూత్ లో అటెన్షన్ ని క్రియేట్ చేసింది. కీర్తి సురేష్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు పెంగ్విన్, మిస్ ఇండియా వచ్చి అభిమానులని బాగా డిసప్పాయింట్ చేశాయి.

అయితే రంగ్ దే సినిమాతో ఆ డిసప్పాయింట్ మెంట్ ని కంప్లీట్ గా పోగొడతానంటోంది క్యూట్ కీర్తి సురేష్. అందుకు సాక్ష్యమే తాజాగా నితిన్ – కీర్తి సురేష్ ల రొమ్నాటిక్ టీజర్ అని క్లారిటీగా తెలుస్తోంది. ఇక ఈ రొమాంటిక్ టీజర్ రిలీజైన కొద్ది గంటల్లోనే హైయ్యెస్ట్ వ్యూస్ ని సాధించింది. ఇక రంగ్ దే సినిమాని మార్చ్ 26 న రిలీజ్ చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించారు. కాగా నితిన్ నుంచి రంగ్ దే తర్వాత చెక్ అన్న సినిమా రాబోతోంది. కీర్తి సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సర్కారు వారి పాట సినిమాలో నటించబోతోంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది