Nithya Menen : ఆరేళ్ల పాటు వేధింపులకి గురైన నిత్యా మీనన్.. ఆమెని అంతలా ఇబ్బంది పెట్టిందెవరో తెలుసా?
Nithya Menen : నిత్యా మీనన్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తన అందం, అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందిన నిత్యా మీనన్ కేవలం మెయిన్ హీరోయిన్‌గానే కాకుండా..సెకండ్ హీరోయిన్ గానూ నటించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించింది. తెలుగులో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, జనతా గ్యారేజ్ వంటి హిట్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ .. ఇటీవల పవన్ సరసన భీమ్లా నాయక్ మూవీలో మెరిసింది. అయితే ఈ అమ్మడు తాజాగా సంచలన కామెంట్స్‌తో వార్తలలో నిలిచింది.
Nithya Menen : నిత్యాకి వేధింపులా?
నిత్యామీనన్ తాను వేధింపులకు గురయ్యానని చెప్పటం ఓ రకంగా అందరినీ షాక్‌కి గురి చేసింది. అసలు నిత్యామీనన్‌ని ఎవరూ వేధించారు. ఎందుకు? అనే వివరాల్లోకి వెళితే.. రీసెంట్‌గా ఓ సందర్భంలో నిత్యామీనన్ తనకు సినీ ఇండస్ట్రీలో ఎదురైన ఇబ్బంది గురించి చెప్పుకొచ్చింది. సంతోష్ వర్గీస్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేసుకున్నాడని, ఆరేళ్ల పాటు తనను సంతోష్ అన్‌పాపులర్ చేశాడని నిత్యామీనన్ పేర్కొంది. ఈ విషయంలో తన తల్లిదండ్రులు తనకు అండగా నిలబడ్డారని, అతన్ని గ్టటిగా హెచ్చరించామని ఆమె తెలియజేసింది. తను సంతోష్‌ను పెళ్లి చేసుకుంటానని వచ్చిన వార్తల్లో నిజం లేదని నిత్యామీనన్ చెప్పింది.
నటుడు మోహన్‌లాల్ ఆరాట్టు సినిమా పేరుపై విశ్లేషణ చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన సంతోష్ వర్గీ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం చేసి ఇబ్బందులకు గురి చేశాడని వాపోయింది.చాలా మంది అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని చెప్పారని, అయితే తాను మాత్రం అతన్ని క్షమించి వదిలేశానని తెలిపింది. సంతోష్ తనను చాలా రకాలుగా అన్ పాపులర్ చేశాడని, చివరకు తన తల్లిదండ్రులు కూడా ఈ వ్యవహారంపై అసహనం వ్యక్తం చేసి అతన్ని గట్టిగా హెచ్చరించారని పేర్కొంది నిత్యా మీనన్. ఇటీవల ఈ అమ్మడు హీరోయిన్‌గానే కాకుడా నిర్మాతగాను సత్తా చాటుతుంది.