NTR : ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఎన్టీఆర్ అంత కుంగిపోయాడా.. రెండు నెలల పాటు ఏం చేశాడంటే…!
NTR : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు ఆనతి కాలంలో మంచి పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. సినిమాలు, సేవా కార్యక్రమాలు, రాజకీయాల ద్వారా ఎన్టీఆర్ అశేష ప్రేక్షకాదరణ పొందాడు. సినిమా పరిశ్రమ అంటే ఎన్టీఆర్… ఎన్టీఆర్ అంటే సినిమా పరిశ్రమ అన్నట్టుగా ఉండేది ఒకప్పుడు పరిస్థితి. సినిమా వాళ్లకు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్టీఆర్ ముందు ఉండే వారు. ఈ క్రమంలోనే ఆయన కొందరిని కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయడానికంటే ముందు సినిమా వాళ్లకు అండగా నిలిచారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్‌ని ఉద్దేశించి కొన్ని సినిమా కథలని రాసుకునే వారు. అయితే భక్త తుకారం సినిమా కోసం.. మొదట్లో అనుకున్నది ఎన్టీఆర్ నే. అయితే, ఆయనకు కాల్ షీట్ల ప్రాబ్లం రావడంతో తర్వాత అక్కినేని నాగేశ్వరరావును ఎంచుకున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి అతి తక్కువ సమయంలోనే ఎక్కువ ఆదాయాన్ని రాబట్టింది. రాము సినిమాలో అన్నగారు నటించారు. మెప్పించారు. కానీ, ఈ సినిమాకు మొదట్లో బుక్ చేసుకున్న హీరో మాత్రం నటశేఖర కృష్ణ. అయితే, ఆయనను ఎందుకో వద్దని అనుకున్నారు. తర్వాత.. ఎన్టీఆర్‌ను బుక్ చేసుకున్నారు. ఇక, ఆయన కాల్ షీట్లు ఖాళీ లేకపోయినా.. ఆరు మాసాలు వెయిట్ చేసి మరీ అన్నగారితోనే ఈ సినిమా చేశారు.
NTR : మనోవేదన చెందిన ఎన్టీఆర్..
జస్టిస్ చౌదరి మూవీకి చాలా డైలాగులు అన్నగారే రాసుకొని ఈ సినిమా విజయంలో కీలక భూమిక పోషించారు. . ఇక, శ్రీకృష్ణ పాండవీయం సినిమాను ఎన్టీఆర్ స్వయంగా నిర్మించి, దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమా కథా పరంగా బాగానే ఉన్నా.. వసూళ్ల పరంగా దెబ్బేసింది. దీంతో ఎన్టీఆర్ రెండు నెలల పాటు మనో వేదనకు గురయ్యి చాలా బాధ పడ్డారు. ఇక ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు ఎన్టీఆర్ కృష్ణుడి వేషం వేయలేదని అంటారు. ఇక, సాంఘిక సినిమాల్లో నటించేప్పుడు.. అన్నగారి సౌష్ఠవం అడ్డువచ్చింది. పొట్టపై శ్రద్ధ పెట్టేవారు కాదు. దీంతో బాలీవుడ్ లో ఒక చక్కని అవకాశం మిస్సయ్యారని.. అంటారు.