Rajamouli : రాజమౌళి కి షాకులిస్తున్న ఎన్టీఆర్ – రామ్ చరణ్ ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajamouli : రాజమౌళి కి షాకులిస్తున్న ఎన్టీఆర్ – రామ్ చరణ్ ..?

 Authored By govind | The Telugu News | Updated on :27 February 2021,2:41 pm

Rajamouli : రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే అందరూ సినిమా రిలీజయ్యే వరకు లాకవ్వాల్సిందే. ఎందుకంటే భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేసే రాజమౌళి ఎక్కువగా వీ.ఎఫ్.ఎక్స్ కి సంబంధించిన వర్క్ ఉండటం తో పాటు భారీ తారాగణం తో సినిమాని తెరకెక్కిస్తుండటమే. ఇక పెద్ద పెద్ద గ్రీన్ మ్యాట్ స్టూడియోలలో తెరకెక్కించే సీన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి షూటింగ్ కి ఎక్కువ రోజులు కేటాయించాల్సి వస్తుంది. అదీకాక హీరో, హీరోయిన్స్ .. రాజమౌళి సినిమా రిలీజయ్యే వరకు ఆయా గెటప్ లోనే ఉండి సినిమాని ప్రమోట్ చేస్తుండాలి.

ntr ram charan are giving shock to rajamouli

ntr-ram-charan-are-giving-shock-to-rajamouli

అందుకే ఎక్కువగా రాజమౌళి సినిమాకి నటీ, నటుల తో పాటు టెక్నీషియన్స్ కూడా నెలలకి నెలలు ప్రాజెక్ట్ లో లాకయి ఉంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కి కరోనా కారణంగా దాదాపు సంవత్సరం పాటు చరణ్ – తారక్ లతో పాటు ఆలియా భట్ లాంటి ప్రముఖ నటీ నటులు తమ డేట్స్ ని మళ్ళీ కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా వాస్తవంగా సంవత్సరంలో రిలీజ్ చేయాలనుకుంటే మరో సంవత్సరం పాటు పొడగించాల్సి వచ్చింది.

Rajamouli : రాజమౌళి వీలైంత త్వరగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటే ..?

మొత్తం మీద ఆర్ ఆర్ ఆర్ సినిమా ముందు ప్లాన్ చేసుకున్న సమయాని కంటే దాదాపు 18 నెలలు ఆలస్యం అయింది. దాంతో చరణ్ – తారక్ కమిటయిన ప్రాజెక్ట్స్ డిలే అయ్యాయి. అయితే ఇప్పుడు చరణ్ – తారక్ రాజమౌళి ని పర్మిషన్ అడిగి మరీ గ్యాప్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆచార్య సినిమా కోసం రాజమౌళి ని చరణ్ రిక్వెస్ట్ చేసి ఆర్ ఆర్ ఆర్ నుంచి గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతం చరణ్ ఆచార్య షూటింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు తారక్ వంతు వచ్చిందంటున్నారు. ప్రముఖ ఛానల్ లో తారక్ ఒక షో చేయబోతుండగా ఆ షో కోసం పర్మిషన్ ఇవ్వమని తారక్ .. రాజమౌళి ని కోరినట్టు తెలుస్తోంది. రాజమౌళి వీలైంత త్వరగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటే ఇలా ఒకరి తర్వాత ఒకరు రిక్వెస్ట్ చేస్తూ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి బ్రేక్ వేస్తున్నారని చెప్పుకుంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది