RRR : ఆర్ ఆర్ ఆర్ నుంచి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న రాజమౌళి.. మార్చ్ 15 నే ఎందుకు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

RRR : ఆర్ ఆర్ ఆర్ నుంచి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న రాజమౌళి.. మార్చ్ 15 నే ఎందుకు..?

 Authored By govind | The Telugu News | Updated on :25 February 2021,1:20 pm

RRR : ఆర్ ఆర్ ఆర్ సినిమా నుంచి దర్శక ధీరుడు రాజమౌళి సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడని సోషల్ మీడియాలో అలాగే ఇండస్ట్రీ వర్గాలలో బాగా ప్రచారం అవుతోంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియన్ రేంజ్ లో రిలీజ్ లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దేశభక్తి ప్రధానంగా ఫిక్షన్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుండగా లో బాలీవుడ్ యంగ్ బ్యూటి ఆలియా భట్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతుష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ మల్టీస్టారర్ గా టాలీవుడ్ లో రూపొందుతోంది. చరణ్ – ఎన్.టి.ఆర్ పోరాట యోధులుగా నటిస్తున్నారు.

rajamouli is going to give surprise why only on march 15

rajamouli-is-going-to-give-surprise-why-only-on-march-15

చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నాడు. వీరిద్దరిని కలిపే కీలక పాత్రలో ఆలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కి జంటగా సీత పాత్రలో కనిపించబోతున్న ఆలియా భట్ మీద రాజమౌళి ఇప్పటికే సాంగ్స్ తో పాటు కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసినట్టు సమాచారం. కాగా మార్చ్ 15 న ఆలియా భట్ పుట్టిన రోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా భట్ పోషిస్తున్న సీత పాత్ర ని రివీల్ చేస్తారని తెలుస్తోంది. మోషన్ టీజర్ లేదా ఆలియా భట్ లుక్ ని రిలీజ్ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.

RRR : ఆర్ ఆర్ ఆర్ లో ఆలియా భట్ ని చూడబోతున్నామని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

కాగా బ్యాలెన్స్ షూటింగ్ కోసం ఆలియా భట్ మళ్ళీ ఏప్రిల్ నెలలో హైదరాబాద్ రానుందని సమాచారం. ప్రస్తుతం చరణ్ ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా రంప చోడవరం.. మారేడుమిల్లి ఫారెస్ట్ లో జరుగుతోంది. అయితే ముందు అనుకున్న కారెక్టర్ కంటే ఇప్పుడు ఆచార్య లో చరణ్ రోల్ లెంగ్త్ పెరిగిందట. అందుకే ఆచార్య కోసం చరణ్ ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించాల్సి రావడం తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ మరో నెల పొడిగించినట్టు సమాచారం. మొత్తానికి త్వరలో ఆర్ఆర్ఆర్ నుంచి ఆలియా భట్ ని చూడబోతున్నామని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది