NTR : ఎన్టీఆర్ వదులుకున్న సినిమానే… గోపీచంద్ కు లైఫ్ ఇచ్చింది… ఆ సినిమా ఏంటంటే…
NTR : సినిమా పరిశ్రమలో కొన్ని కథలు ఒక హీరో రిజెక్ట్ చేయగా మరో హీరో చేస్తాడు. ఒక హీరో వదులుకున్న కథ మరో హీరో చేసి సూపర్ హిట్ అందుకుంటాడు. అలా సినీ పరిశ్రమలో చాలా వరకు జరిగాయి. ఇలా జరగటం కూడా సాధారణమే. అలా ప్రతి ఒక్క స్టార్ హీరో కెరియర్లో ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం అలాంటి సూపర్ హిట్ సినిమాలను వదులుకున్నారు అని తాజాగా తెలిసింది. అమ్మ రాజశేఖర్ ఆటో డాన్స్ షో ద్వారా కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అమ్మ రాజశేఖర్ ఆ డ్యాన్స్ షో లో జడ్జిగా వ్యవహరించారు.
దీని ద్వారా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక అప్పట్లో స్టార్ హీరోల సినిమాలకు అమ్మ రాజశేఖర్ కొరియోగ్రఫీ చేశారు. అమ్మ రాజశేఖర్ కేవలం కొరియోగ్రఫీకి పరిమితం కాకుండా దర్శకత్వం వైపుకు కూడా అడుగులు వేశారు. ఆ సమయంలో అమ్మ రాజశేఖర్ తాను ఒక కథను జూనియర్ ఎన్టీఆర్ కు వినిపించానని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే మొదటిగా ‘ రణం ‘ సినిమా స్క్రిప్టును తాను ఎన్టీఆర్ కి చెప్పానని అమ్మ రాజశేఖర్ అన్నారు. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో హీరో విలన్ ముందు చేతులు కట్టుకొని కూర్చోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ సినిమా ఎన్టీఆర్ స్థాయికి సరిపోదని ముందే అనిపించిందని చెప్పారు.
అయితే ఎన్టీఆర్ కూడా ఆ సినిమా కథ విని బాగుంది కానీ ఈ కథకు గోపీచంద్ బాగా సెట్ అవుతాడని సలహా ఇచ్చినట్టు తెలిపారు. దీంతో తాను సంతోష్ శ్రీనివాస్ ద్వారా గోపీచంద్ కు కథ వినిపించానని అమ్మ రాజశేఖర్ తెలిపారు. ఇక గోపీచంద్ కు కూడా ఈ కథ నచ్చడంతో సినిమా పట్టాలెక్కిందని అన్నారు. అలా వచ్చిన ‘ రణం ‘ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. తర్వాత అమ్మ రాజశేఖర్ తానే హీరోగా రణం 2 ను తెరకెక్కించారు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా మిగిలిపోయింది. అంతేకాకుండా అమ్మ రాజశేఖర్ వేరే చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు. అయితే ‘ రణం ‘ సినిమాకు తప్ప మరో ఏ సినిమాకు హిట్ పడలేదు.