Bimbisara Movie : అన్నయ్య విజ్ఞప్తిని కాదన్న ఎన్టీఆర్‌..? – బింబిసార | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bimbisara Movie : అన్నయ్య విజ్ఞప్తిని కాదన్న ఎన్టీఆర్‌..? – బింబిసార

 Authored By aruna | The Telugu News | Updated on :2 August 2022,1:20 pm

Bimbisara Movie : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే జోరుగా సాగాయి.. ఇంకా కూడా సినిమాను విపరీతంగా ఖర్చు చేస్తూ ప్రచారం చేసేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి హీరో ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. సినిమా ట్రైలర్ కూడా విభిన్నంగా ఉండి ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది అని నమ్మకం కలిగించింది.

దాదాపుగా 45 నుండి 50 కోట్ల బడ్జెట్ ను ఈ సినిమా కోసం నందమూరి కళ్యాణ్రామ్ ఖర్చు చేసాడని తెలుస్తోంది. ఇంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా లో ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ ఉంటే బాగుంటుందని కళ్యాణ్ భావించాడట. చిన్న పాత్ర ని క్రియేట్ చేసి అందులో ఎన్టీఆర్ ని నటింపజేసేందుకు కళ్యాణ్రామ్ ప్రయత్నించాడట.. కానీ అందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పలేదని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా ప్రమోషన్ వరకు ఓకే గాని సినిమాలో నటించడం తన వల్ల కాదని, అందుకు తాను ఒప్పుకోను అంటూ ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించినట్లు గా తెలుస్తోంది.

NTR says no to Bimbisara movie as guest role

NTR says no to Bimbisara movie as guest role

ప్రాముఖ్యత లేని పాత్రలో.. కేవలం పబ్లిసిటీ కోసం లేదా ప్రేక్షకుల అటెన్షన్ ని దక్కించుకోవడం కోసం సినిమాలో నటించడం అనేది తనకు ఇష్టం ఉండదని ఎన్టీఆర్ అన్నాడట. అందుకే ఈ సినిమాను తిరస్కరించాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో కానీ ఒకవేళ నిజంగానే ఎన్టీఆర్ బింబిసార సినిమాలో ముఖ్యమైన గెస్ట్ రోల్ లో నటించి ఉంటే కచ్చితంగా సినిమా స్థాయి రెట్టింపయ్యేది అంటూ నందమూరి అభిమానులు మరియు సినీ ప్రేక్షకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దాంతో నందమూరి కళ్యాణ్ రామ్ కి భారీగా లాభాలు వచ్చేవి.. కానీ ఎన్టీఆర్ అందుకు నిరాకరించారు అనేది టాక్‌.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది