Samantha : సమంత జీవితాన్ని ఈ మోసలోడు నాశనం చెయ్యబోతున్నాడు !
Samantha : సోషల్ మీడియాలో సమంత వర్సెస్ సీనియర్ నిర్మాత నటుడు త్రిపురనేని చిట్టిబాబు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. చాలా యూట్యూబ్ ఛానల్స్ కి త్రిపురనేని చిట్టిబాబు ఇండస్ట్రీకి సంబంధించి అనేకమంది వారి విషయాలు తెలియజేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఈమధ్య బాగా పాపులారిటీ సంపాదించారు. సినిమా పరంగా అదేవిధంగా రాజకీయపరమైన విశ్లేషణలు కూడా చిట్టిబాబు చేస్తూ ఉంటారు. అయితే కొద్ది రోజుల క్రితం “శాకుంతలం” సినిమా కోసం ఓ ఛానల్ వారు చిట్టిబాబు అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ క్రమంలో శకుంతల పాత్ర సమంతకి అసలు సూట్ కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అదే సమయంలో సెంటిమెంట్ డ్రామా ఆడుతూ సినిమా సక్సెస్ చేసుకోవాలని సింపతి సంపాదించాలని చూస్తోంది అంటూ… కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. సమంత టైం అయిపోయింది అని గాటు వ్యాఖ్యలు చేశారు. చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు… సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమంత దాకా వెళ్లడంతో.. ఆమె తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. చెవిలో వెంట్రుకలు పెరగటానికి టెస్టోస్టిరాన్ హార్మోన్ కారణమంట దానికి సంబంధించిన గూగుల్ ఇన్ఫర్మేషన్ తో స్క్రీన్ షాట్షేర్ చేశారు. ఈ వ్యాఖ్యలు చిట్టిబాబుని ఉద్దేశించి సమంతా పరోక్ష వ్యాఖ్యలు చేయడం జరిగింది.
దీంతో సమంత చేసిన వ్యాఖ్యలపై చిట్టిబాబు తాజాగా రియాక్ట్ అయ్యారు. ఒక మీడియా వారు వచ్చి అడిగితేనే తన అభిప్రాయం చెప్పడం జరిగిందని… ఇప్పటికే ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. శకుంతల పాత్రకి యవ్వనంలో ఉన్న అమ్మాయి కావాలి. సమంత వయసు అయిపోయింది. ఆమె ఆ విధంగానే కనిపిస్తుంది. అందుకే సెట్ కాదని ఆ ఇంటర్వ్యూలో చెప్పాను అంటూ సమంత జీవితాన్ని డేంజర్ జోన్ లో పడేసేటట్టు త్రిపురనేని చిట్టిబాబు తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వటం జరిగింది.