Hyper Aadi : పారితోషికం పెంచినా కూడా బాబోయ్‌ మళ్లీ రాను అంటున్న హైపర్ ఆది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hyper Aadi : పారితోషికం పెంచినా కూడా బాబోయ్‌ మళ్లీ రాను అంటున్న హైపర్ ఆది

 Authored By aruna | The Telugu News | Updated on :3 September 2022,8:30 pm

Hyper Aadi : జబర్దస్త్ నుండి ఒక్కరు ఒక్కరు అంటూ చాలా మంది వెళ్లి పోయారు. కమెడియన్స్‌, యాంకర్, జడ్జి ఇలా చాలా మంది జబర్దస్త్ ను వీడి వెళ్లిపోవడంతో ఆ కార్యక్రమం యొక్క రేటింగ్ దారుణంగా పడిపోయింది. జబర్దస్త్ నుండి వెళ్లి పోయిన వారు పక్క ఛానల్ కి వెళ్లడం పరి పాటిగా మారింది. కానీ హైపర్ ఆది జబర్దస్త్ నుండి వెళ్లి పోయాడు కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో కొనసాగుతున్నాడు. అంతే కాకుండా ఢీ డాన్సు కార్యక్రమంలో కూడా ఆయన కనిపిస్తున్నాడు. మరి జబర్దస్త్ ఒక్కటే ఏం పాపం చేసిందని ఆయన కాదంటున్నాడు, వద్దంటున్నాడు అర్థం కావడం లేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.

తాజాగా సినీ వర్గాలు మరియు బుల్లి తెర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం హైపర్ ఆదిని మళ్లీ జబర్దస్త్ కార్యక్రమానికి తీసుకు వచ్చేందుకు మల్లెమాల మరియు ఈటీవీ వర్గాల వారు ప్రయత్నించారట. ఆయనకు గతం తో పోలిస్తే 30 నుండి 40 శాతం అదనపు పారితోషకాన్ని ఇచ్చేందుకు కూడా మల్లెమాల వారు ఓకే చెప్పారట. కానీ జబర్దస్త్ కార్యక్రమానికి సొంతంగా స్కిట్ రాసుకోవలసి వస్తుంది. అందుకోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. అట అందుకే హైపర్ ఆది తనకు ఎంత పారితోషికం ఇచ్చినా కూడా ప్రస్తుతానికి జబర్దస్త్ కి రాలేను అన్నాడట.

once again hyper aadi sad no to re join in Jabardasth comedy show

once again hyper aadi sad no to re join in Jabardasth comedy show

మంచి సమయం చూసి జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇస్తాను అంటూ హైపర్ ఆది వారికి హామీ ఇచ్చారట. కానీ ఆయన తీరు చూస్తుంటే ఇప్పట్లో జబర్దస్త్ లో మళ్లీ అడుగు పెట్టే అవకాశం లేదని అంటున్నారు. ఆయన వేరే వారి రైటింగ్ స్కిట్ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు.. అలా అని సొంతంగా రాసుకోవడానికి సమయం లేదు అంటున్నాడు. వరుసగా సినిమాల్లో కూడా ఈయన నటిస్తున్నాడు. అందుకే ఆయన జబర్దస్త్ లో రీ ఎంట్రీ అనేది కష్టమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ శ్రీదేవి డ్రామా కంపెనీలో మాత్రం ఆయన కంటిన్యూ అయ్యి నవ్వులు పూయించడం కన్ఫమ్.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది