Bheemla Nayak : అడవి తల్లి మాట చెప్పిన భీమ్లా నాయక్.. పంతంతో పవన్ కల్యాణ్, రానా మధ్య కొట్లాట..!
Bheemla Nayak: లిరిసిస్ట్ ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి కన్నుమూత నేపథ్యంలో ‘భీమ్లానాయక్’ మూవీ నుంచి ‘అడవి తల్లి మాట’ లిరికల్ సాంగ్ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. కాగా, ఆ సాంగ్‌ను మేకర్స్ శనివారం రిలీజ్ చేశారు. పద్మశ్రీ సిరివెన్నెలకు నివాళి అర్పిస్తూ పాటను విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మలాయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియముమ్’ రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్లే చేస్తున్నారు.
‘కిందున్న మడుసులట కోపాలు తెమలవు, పైనున్న సామేమో కిమ్మని పలకడు’, ‘చెప్తున్న నీ మంచి చెడ్డ.. ఆంతోని పంతానికి పోవద్దు బిడ్డ’ అంటూ అత్యద్భుతమైన లిరిక్స్‌ను రామజోగయ్య శాస్త్రి అందించగా, పాటను సింగర్స్ దుర్గవ్వ, సాహితి చాగంటి ఆలపించారు. మట్టి గొంతుక, జనం యాసలో ఉన్న పాట మరో రేంజ్‌లో ఉంటుందని పాట విన్న అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక వీడియోలో భీమ్లానాయక్ పాత్రలో పవన్ కల్యాణ్ తన హావ భావాలను ప్రకటిస్తుండగా, ఆయన భార్య నిత్యామీనన్ తన క్యూట్ అండ్ డీసెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆక్టుకుంటోంది.
Bheemla Nayak : మట్టి గొంతుకలో ఆకట్టుకుంటున్న పాట..
నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్న రానా తనదైన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంటున్నారు. రానాకు జోడీగా నటిస్తున్న సంయుక్త మీనన్ సైతం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే ఆకట్టుకుంటోంది. సముద్రఖని ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. ఇకపోతే ఈ చిత్రానికి టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మట్టి గొంతుకలను వెండితెరకు పరిచయం చేస్తున్నారు థమన్. ఇప్పటికే కిన్నెరమెట్ల మొగులయ్య, దుర్గవ్వలతో పాటలు పాడించారు. ఈ చిత్రానికి సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు.