Rajendra prasad : రాజేంద్ర ప్రసాద్ చేసిన ఆ పనికి వెక్కి వెక్కి ఏడ్చిన నటి ఎవరో తెలుసా..!
Rajendra prasad : తెలుగు సినీ పరిశ్రమలో నట కీరిటి రాజేంద్ర ప్రసాద్ సినీ కెరియర్ గురించి తెలియని వారుండరు. దాదాపు పాతిక సంవత్సరాల పాటు తెలుగు ప్రేక్షకులను కడపుబ్బా నవ్వించి మంచి గుర్తింపు దక్కించుకున్నారాయన. కేవలం కామెడీతోనే కాకుండా మంచి మంచి పాత్రల్లో అద్భుతంగా నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. హీరోగా అవకాశాలు కనుమరుగై పోయినా… సహాయనటుడిగా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలను సొంతం చేసుకుంటూ ఇప్పటికీ తన అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే రాజేంద్ర ప్రసాద్ కు కోపం కూడా చాలా ఎక్కువే అంట. రాజేంద్ర ప్రసాద్ చేసిన పనికి తాను ఏడ్చాను అని నటి పూజిత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజేంద్ర ప్రసాద్ చాలా మంచి నటుడని పేర్కొన్న నటి పూజిత అయన గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆయనకు కోపం ఎక్కువగా ఉంటుందని దాని వల్ల గతంలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. రాజేంద్రప్రసాద్ ఓ సందర్భంలో తన మీద కోపంతో విపరీతంగా అరిచిన విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఓ సినిమాలో సీన్ షూటింగ్ లో భాగంగా రాజేంద్ర ప్రసాద్‌ను తను తోసేయాల్సి ఉందట. దీంతో పూజిత రాజేంద్ర ప్రసాద్ ను గట్టిగా తోసేయడంతో ఆయన వెళ్లి ఒక తలుపునకు గుద్దుకున్నారట.వెంటనే సారీ చెబుదామని పూజిత రాజేంద్రప్రసాద్ దగ్గరకు పరిగెత్తుకొని వెళ్లిందట. అయితే ఎవరూ ఊహించని విధంగా.. ఆయన తనపై గట్టిగా అరిచి.. కేకలు వేశారట. ఆ పరిణామం అనంతరం…

Poojitha reveal actor and hero Rajendra prasad angry side
Rajendra prasad : నటిపై ఫైర్ అయిన రాజేంద్ర ప్రసాద్..!
ఆయనతో సీన్ చేయాలి అంటే తనకు చాలా భయం వేసింది అని.. చాలా టేక్‌లు తీసుకోవాల్సి వచ్చిందని పూజిత చెప్పుకొచ్చారు. భయంతో ఎక్కువ టేక్ లు తీసుకోవడంతో రాజేంద్రప్రసాద్ కోపంతో తన దగ్గరకు వచ్చి.. ఏమ్మా నువ్వు సరిగా చేయలేవా ? మాకూ సంసారాలు ఉన్నాయి… మేమూ త్వరగా వెళ్లాలి అనేసరికి తనకు ఎంతో బాధ వేసిందని చెప్పుకుంటూ ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. సీన్ షూటింగ్ పూర్తైన అనంతరం.. తాను ఏడుస్తుంటే డైరెక్టర్ వచ్చి సర్ది చెప్పారని పూజిత చెప్పింది. మరుసటి రోజు తాను షూటింగ్‌కు వెళ్లను అని అంటే తన తండ్రి మొదట నీకు ఇష్టమయ్యే ఇక్కడకు వచ్చావుగా.. ఇప్పుడు వెళ్లను అంటే ఎలా అనేసరికి మళ్ళీ షూటింగ్ లో జాయిన్ అయినట్లు ఆమె చెప్పుకొచ్చారు.