Fish Venkat Prabhas : ఫిష్ వెంకట్ ఆపరేషన్‌కు ప్రభాస్ భారీ సాయం..!
ప్రధానాంశాలు:
Fish Venkat Prabhas : ఫిష్ వెంకట్ ఆపరేషన్‌కు ప్రభాస్ రూ.50 లక్షల సాయం..!
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన కిడ్నీ సంబంధిత సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ హీరో ప్రభాస్ Prabhas ముందుకు వచ్చి, ఫిష్ వెంకట్‌కు Fish Venkat ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించారు…

Fish Venkat Prabhas : ఫిష్ వెంకట్ ఆపరేషన్‌కు ప్రభాస్ భారీ సాయం..!
Fish Venkat Prabhas : గొప్ప మనసు..
ప్రభాస్ Prabhas అసిస్టెంట్, ఫిష్ వెంకట్ కూతురికి కాల్ చేసి, “ఫిష్ వెంకట్ యొక్క కిడ్నీ ఆపరేషన్ కోసం అవసరమైన రూ.50 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫిష్ వెంకట్ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఫిష్ వెంకట్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రభాస్ చేస్తున్న ఈ సాయం చాలా గొప్పది అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. గతంలో తీవ్ర అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నాడు. అప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు.
దీంతో కొన్ని రోజులు బాగానే ఉన్నాడీ నటుడు. అయితే మళ్లీ ఇప్పుడు ఆస్పత్రి పాలయ్యాడు ఫిష్ వెంకట్. తీవ్ర అనారోగ్యం పాలు కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నాడు. మరోవైపు ఫిష్ వెంకట్ చికిత్స కోసం సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని నటుడి భార్య, కూతురు చేతులెత్తి మొక్కుతున్నారు. కాగా ఫిష్ వెంకట్ కు సరైన చికిత్స అందితే బతికే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు.