Prabhas : అడుగడుగున చేదు అనుభవాలను ఎదుర్కొంటున్న ప్రభాస్… నా అనుకున్న వాళ్ళే నిట్ట నిలువుగా ముంచేసారుగా…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : అడుగడుగున చేదు అనుభవాలను ఎదుర్కొంటున్న ప్రభాస్… నా అనుకున్న వాళ్ళే నిట్ట నిలువుగా ముంచేసారుగా…!

 Authored By aruna | The Telugu News | Updated on :23 November 2022,11:00 am

Prabhas : ప్రస్తుతం ప్రభాస్ కు చేదు అనుభవాలు బాగా ఎదురవుతున్నాయని చెప్పాలి. తెలుగు సినీ ఇండస్ట్రీలో రెబల్ గా పేరు పొందిన ప్రభాస్ చాలా సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత బాహుబలి సినిమాలో నటించి ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ట్ గా నిలిచాడు. దీంతో ప్రభాస్ పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. దీంతో ప్రభాస్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కాని బాహుబలి తర్వాత వచ్చిన సాహో ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తో కొనసాగుతున్నాడు ప్రభాస్.

కానీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దగ్గర నుండి ప్రభాస్ కు చేదు జ్ఞాపకాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని తెలుస్తోంది. ప్రభాస్ రీసెంట్ గా నటిస్తున్న ఆది పురుష్ సినిమా ట్రైలర్ ఈ మధ్య రిలీజ్ అయి ట్రోలింగ్ కు గురవుతూ వస్తుంది. ఈ ట్రైలర్ లోని క్యారెక్టర్స్ అన్నీ చాలా భిన్నంగా ఉండడంతో జనాలు ట్రోలింగ్ బాగా చేస్తున్నారు. అయితే రీసెంట్ గా హనుమాన్ టీజర్ విడుదలవడంతో ఆది పురుష్ సినిమా కంటే ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుందంటూ ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంది. ఆది పురుష్ సినిమా గ్రాఫిక్స్ విషయంలో గట్టిగా ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే.

Prabhas is facing bitter experiences at every step

Prabhas is facing bitter experiences at every step

కాగా టాలీవుడ్ యంగ్ హీరో తేజ రీసెంట్ గా నటించిన హనుమాన్ సినిమా యొక్క టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో అసలైన గ్రాఫిక్స్ అంటే ఇది… సినిమా అంటే ఇలా తీయాలి అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాల టీజర్లను నేటిజనులు కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. తేజ నటించిన హనుమాన్ టీజర్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ కంటే 1000 రేట్లు బెటర్ గ్రాఫిక్స్ తో ఉందని చెప్పుకొస్తున్నారు. దీంతో టాలీవుడ్ స్టార్ హీరో లు సైతం హనుమాన్ టీజర్ ను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది