Prabhas Salaar Movie : ప్రభాస్ సలార్ సినిమా బడ్జెట్ చూస్తే రాజమౌళి కూడా దండం పెట్టి పారిపోతాడు .. అన్ని కోట్లా వామ్మో !

Advertisement

Prabhas Salaar Movie : రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్క ‘ బాహుబలి ‘ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. ఆ తర్వాత వరుసగా అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. అయిన ఆ సినిమాలు అంతగా సక్సెస్ కావడం లేదు. బాహుబలి తర్వాత వచ్చిన ‘ సాహో ‘ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. బాలీవుడ్ లో మాత్రం 150 కోట్లు సాధించింది. కానీ తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత రాధేశ్యామ్ సినిమా కూడా భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ప్రభాస్ ఇప్పట్లో కోలుకోడు అనుకున్నారు. కానీ ప్రభాస్ కు వరుసగా పాన్ ఇండియా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

Prabhas Salaar Movie high budget
Prabhas Salaar Movie high budget

ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ‘ ఆదిపురుష్ ‘, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘ సలార్ ‘, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ ప్రాజెక్ట్ కె ‘ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘ స్పిరిట్ ‘ ఇలా అన్ని సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నాయి. ఇక ప్రభాస్ నుంచి ఈ సంవత్సరం రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఆది పురుష్, సలార్ సినిమాలు ప్రేక్షకుల ముందు రాబోతున్నాయి. దీంతో ఈ సినిమాలపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. మరి ముఖ్యంగా సలార్ సినిమాపై మామూలు అంచనాలు లేవు.

Advertisement

Salaar release date out: Prabhas to 'rebel worldwide' in April 2022 -  Hindustan Times

ఈ సినిమాలో ప్రభాస్ గతంలో ఎప్పుడు కనిపించలేని విధంగా యాంగ్రీ లుక్ లో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తుంది. అలాగే విలన్ పాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా రైట్స్ కోసం గట్టి డిమాండ్ ఏర్పడిందని ఇండియన్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కేవలం ఆంధ్రప్రదేశ్ రీజియన్ రైట్స్ కోసమే 100 కోట్ల డీల్ వచ్చిందని తెలుస్తుంది. దీంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ థ్రియేటికల్ రైట్స్ 200 కోట్లకు పైగా అమ్ముడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాలో కేజిఎఫ్ హీరో యష్ కూడా కనిపించబోతున్నాడని సమాచారం.

Advertisement
Advertisement