Prabhas : పొరపాటున కూడా ఈ సినిమా విషయం లో ‘ ఆ పని ‘ చెయ్యకూడదు — ప్రభాస్ సీరియస్ నిర్ణయం !
Prabhas : పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలోనే ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఓంరౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది. ఈ క్రమంలోనే మూడు రోజుల నుండి ట్రిబేకా ఫిలిం ఫెస్టివల్ లో ఆదిపురుష్ ప్రీమియర్లు వేయబోతున్నారు. ప్రదర్శించబోయే అన్ని సినిమాల కంటే దీనికే టికెట్లు చాలా ముందస్తుగా సేల్ అవ్వడం సంచలనంగా మారింది. అయితే వీటిని క్యాన్సిల్ చేస్తున్నట్టుగా వచ్చిన వార్త అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. అంతేకాదు భారతీయ కాలమాల ప్రకారం ముందుగా వేసే యూఎస్ షోలను క్యాన్సిల్ చేసే దిశగా నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు అప్డేట్ వచ్చింది. ఇంకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు రాలేదు.
అయితే ఇది ఒక రకంగా మంచిదే అని అంటున్నారు. ఎందుకంటే ఈ ఎర్లీ షోల వలన టాక్ డివైడ్ గా రావడం యూఎస్ రివ్యూలు అటు ఇటు కావడం ఈమధ్య కామన్ అయిపోయింది. పైగా విజువల్ ఎఫెక్ట్స్ మీద ఇప్పటికే విమర్శలు ఉన్న నేపథ్యంలో ఫుల్ కంటెంట్ చూశాక ఏదైనా తేడా రిపోర్ట్స్ వచ్చాయంటే దాని ప్రభావం వేరుగా బాక్స్ ఆఫీస్ మీద పడుతుంది. ట్రైలర్ చూశాక ప్రేక్షకులలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. తక్కువ టైంలో వంద మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై నమ్మకం కుదిరిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తో ఆది పురుష్ సినిమాపై నెగెటివిటీ తగ్గింది అని చెప్పవచ్చు. అయినా కూడా ఈ నిర్ణయం తీసుకుంటే సాహసమే.
జూన్ 15న తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై లాంటి ప్రధాన నగరాల్లో ప్రీమియర్ షోలు వేసే ప్రతిపాదనని టి సిరీస్ ఇంకా పరిశీలనలో ఉంచింది. ధార్మిక సంస్థలకు, ఆలయాల ఉద్యోగులకు, ప్రభుత్వ ప్రతినిధులు మంత్రులకు స్క్రీనింగ్ చేసే ఆలోచనలు జరుగుతున్నాయి. మొత్తానికి ఆది పురుష్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 16న విడుదల కాబోతున్న ఆది పురుష్ సినిమా ప్రభాస్ కు ఎటువంటి టాక్ ను ఇస్తుందో చూడాలి. ఇకపోతే ప్రభాస్ బాహుబలి తర్వాత అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. గతంలో వచ్చిన రాధే శ్యామ్, సాహో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో భారీగా డిజాస్టర్ అయ్యాయి. దీంతో ప్రభాస్ ఆదిపురుష్ సినిమాపై భారీ అంచునాలు పెట్టుకున్నారు.