Karthika Deepam : డాక్టర్ బాబు బర్త్ డే సెలెబ్రేషన్స్.. వంటలక్కకు పరాభవం.. వీడియో !
Karthika Deepam కార్తీకదీపం సీరియల్ Karthika Deepam తో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత, సౌందర్య, హిమ, శౌర్య ఇలా కొన్ని పాత్రలు తెలుగు వారికి బాగా ఎక్కేశాయి. ఇందులో మరీ ముఖ్యంగా డాక్టర్ బాబు, వంటలక్కకు ఉండే క్రేజ్ వేరు. డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రలో నిరుపమ్.. వంటలక్క, దీప పాత్రలో ప్రేమీ విశ్వనాథ్ చేసే యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఒకానొక దశలో ఈ ఇద్దరూ ఎప్పుడు కలుస్తారా? అని అందరూ ఎదురుచూసేవారు.
కలవాలని కోరుకునే వారు. అంతలా ఈ సీరియల్ ప్రభావం చూపించింది.ఇప్పుడు కథ ఎటెటో తిరుగుతుండటంతో జనాలకు కాస్త చిరాకు పుడుతోంది. అయితే తాజాగా డాక్టర్ బాబు బర్త్ డే వచ్చింది. నిరుపమ్ బర్త్ డేను ఆయన భార్య మంజుల స్పెషల్‌గా ప్లాన్ చేసింది. అపార్ట్మెంట్‌లోని అందరినీ పోగు చేసిన మంజుల.. నిరుపమ్‌కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది.
కార్తీకదీపం సీరియల్ వంటలక్కకు పరాభవం Karthika Deepam
అంతే కాకుండా నిరుపమ్ బర్త్ డేను కార్తీకదీపం యూనిట్ కూడా సెలెబ్రేట్ చేసింది. సెట్‌లో జరిగిన ఈ వేడుకలో కొన్ని ఆసక్తికర సంఘటనలు జరిగాయి.కేక్ కట్ చేసిన నిరుపమ్.. రెండు చేతుల్లో రెండు స్పూన్స్‌తో కేక్ ముక్కలు పట్టుకున్నారు. ఇక ఎవరికి పెడతారు? అని అందరూ అడగడంతో.. ఒకేసారి దీపకు, మోనితకు పెట్టేశాడు.
అయితే దీప, మోనిత సైతం కేక్ తినిపించేందుకు ప్రయత్నించారు. కానీ డాక్టర్ బాబు మాత్రం వేరే వాళ్లకు తినిపిస్తూ ఉన్నాడు. ఇక దీప అయితే అలానే చేతిలో పట్టుకుని ఉంది. చివరకు మోనిత కూడా తినిపించేసింది. కానీ దీప మాత్రం ఇంకా అలానే పట్టుకుని ఉంది. మీ కోసం ఇలానే పదేళ్లు ఎదరుచూస్తూనే ఉన్నాను.. డాక్టర్ బాబు. ఇప్పుడు కూడా మీరు ఇలానే చేస్తున్నారు అంటూ డాక్టర్ బాబుపై దీప కౌంటర్ వేసింది. ఆ మాట అనడంతోనే నిరుపమ్ దగ్గరకు వచ్చి ఆ కేక్ ముక్కను తినేశాడు.
