Chittibabu : జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు పై షాకింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత చిట్టిబాబు..వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chittibabu : జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు పై షాకింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత చిట్టిబాబు..వీడియో !

Chittibabu  : జనవరి 18న నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు. అయితే ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఉదయమే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా తారక రామారావు సమాధి వద్దకు చేరుకొని ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇకపోతే ఎన్టీఆర్ తన తాతయ్యకు నివాళులు అర్పించడానికి రాబోతున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అక్కడ […]

 Authored By aruna | The Telugu News | Updated on :21 January 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Chittibabu : జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు పై షాకింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత చిట్టిబాబు..!

Chittibabu  : జనవరి 18న నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి ఆయనకు నివాళులు అర్పించారు. అయితే ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఉదయమే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా తారక రామారావు సమాధి వద్దకు చేరుకొని ఆయనకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇకపోతే ఎన్టీఆర్ తన తాతయ్యకు నివాళులు అర్పించడానికి రాబోతున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అక్కడ ఎన్టీఆర్ అభిమానులు చేరుకోవడమే కాకుండా ఎన్టీఆర్ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించి వెళ్లిన కాసేపటికి బాలకృష్ణ అక్కడికి చేరుకున్నారు. వెళ్ళగానే అక్కడ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అన్నింటిని తీసేయమని తన అనుచరులతో చెప్పడంతో ఆ విషయం కాస్త వివాదంగా మారింది.

ఇక ఈ విషయంపై తాజాగా నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ఘాటు వద్ద ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని బాలయ్య చెప్పిన దాంట్లో తప్పు లేదని అన్నారు. బాలయ్య కనుక అలా చెప్పారు నేను కనుక ఉంటే నా రియాక్షన్ మరోలా ఉండేదని ఆయన తెలిపారు. ఎవరైనా కానీ చనిపోయిన వారి దగ్గర బ్రతికున్న వారి ఫోటోలను పెడతారా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసే వారికి ఏమాత్రం పని పాట లేదని, అందుకే చనిపోయిన వారి ఘాటు వద్ద బ్రతుకున్న వారి ఫోటోలను పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం ఉంటే సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలను ఘాటు వద్ద పెట్టాలి కానీ బ్రతికున్న వారి ఫోటోలు పెట్టడం ఏంటని అన్నారు.

రాజకీయాల పరంగా ఎన్టీఆర్ ను అణచివేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై కూడా చిట్టిబాబు స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలోకి రావాలి అంటే ఆయనను ఎవరు అడ్డుకోరు. కానీ ఆయనకు సినిమాలంటేనే ఆసక్తి. తన చుట్టూ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లకు మంచి సినిమాలు ఇవ్వాలన్న తపనతో సినిమాలలో నటిస్తున్నారని, సినిమాలు తన జీవితం అనుకున్నాడు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అభిమానులకు న్యాయం చేయాలని గెటప్ లు మారుస్తూ నేడు గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తన జీవితం సినిమాలు అనుకున్నాడు కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు. అంతే తప్ప ఇందులో ఎవరి ప్రమేయం లేదని చిట్టిబాబు అన్నారు. ఆయన రాజకీయాలలోకి వస్తే ఆపగలిగే శక్తి ఎవరికీ లేదని చిట్టిబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది