Pushpa 2 Movie : పుష్ప 2 సినిమా మరింత వెనక్కి.. 2024లో విడుదల కానుందా?
Pushpa 2 Movie : బాక్సాఫీస్ దగ్గర రికార్డుల ప్రభంజనం సృష్టించిన చిత్రం పుష్ప. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం తెలుగులోనే కాకుండా హిందీ భాషలలోను అదరగొట్టింది. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అల్లు అర్జున్. నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రం తర్వాత అల్లు అర్జున్ రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నారు. 2020లో అల వైకుంఠపురంలో మూవీ విడుదల చేశారు. ఇక పుష్ప విడుదలకు మరో రెండేళ్ల సమయం తీసుకున్నాడు. కనీసం పుష్ప 2 ఏడాది లోపే వస్తుందని అందరూ భావించారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న క్రమంలో ఈ ఏడాది చివరికల్లా విడుదల చేస్తారని భావించారు.
కాని ఈ చిత్రం ఇంకా లేట్ అయ్యేలా కనిపిస్తుంది. జూలైలో ప్రారంభం కావల్సిన ఈ చిత్రం అక్టోబర్ కి వెళ్లిందని అంటున్నారు. 2023లో కూడా పుష్ప విడుదలయ్యే సూచనలు లేవంటున్నారు. లేటైనా పకడ్బందీగా భారీ ఎత్తున చిత్రీకరించాలనేది దర్శకుడు సుకుమార్ ఆలోచనట. కెజిఎఫ్ పార్ట్ 1 తో పోల్చితే కెజిఎఫ్ 2 భారీ విజయం సాధించింది. ఆ మూవీపై ఉన్న హైప్ ఆ స్థాయి వసూళ్లకు కారణమైంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 ను అదే స్థాయిలో హిట్ చేయాలనేది మేకర్స్ ఆలోచన. ఎటూ పుష్ప హిందీ బెల్ట్ లో మంచి హైప్ తెచ్చుకుంది. 2024లో పుష్ప 2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది ప్లాన్ గా తెలుస్తుంది.

Pushpa 2 Movie comes in 2024
Pushpa 2 Movie : ఏమైంది పుష్ప..
ఈ సినిమాలో శ్రీవల్లీ పాత్రలో రష్మిక ఆకట్టుకుంది. ‘పుష్ప 2’ విషయానికి వచ్చేసరికి రష్మికతో పాటు మరో కథానాయికకు చోటు ఉందనే టాక్ బలంగానే వినిపిస్తోంది. ఆ కథానాయిక ఎంపిక విషయంలోనే కసరత్తు జరుగుతోందట. శ్రీవల్లీ పాత్ర ఏమిటనేది అందరికీ తెలిసిందే .. ఫస్టు పార్టులో ఆమెతో పుష్పకి పెళ్లి జరుగుతుంది. మరో హీరోయిన్ పాత్ర ఏ వైపు నుంచి ఉండనుందనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన భన్వర్ సింగ్ షెకావత్ చెల్లెలు పాత్రలో మరో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. మరి ఆ చెల్లెలు ఎవరనేది తెలియాల్సి ఉంది.