అన్నీ అప్పులే అన్నమాట.. రాహుల్ సిప్లిగంజ్ మామూలోడు కాదు

Authored By Admin | The Telugu News | Updated on: December 23, 2020, 10:55 am

రాహుల్ సిప్లిగంజ్ ప్రతీసారి ఓ మాట చెబుతుంటాడు. తెలుగులో ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ క్రియేట్ చేయడంలో ముందుంటాను.. మన రేంజ్‌ను పెంచాలనే ఉద్దేశ్యంతోనే ప్రైవేట్ ఆల్బమ్స్‌ను చేస్తుంటాను.. దాంట్లో నాకు ఒక్క రూపాయి కూడా రాదు..పైగా నేను అప్పులు చేసి మరీ ఆల్బమ్స్‌ను క్రియేట్ చేస్తాను అని రాహుల్ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. చివరకు తన అమ్మ గాజులు, పుస్తెలు అమ్మి కూడా ఆల్బమ్స్ చేశానని తెలిపాడు.

Rahul Sipligunj satires on Suma In Big Celebrity Challenge

Rahul Sipligunj satires on Suma In Big Celebrity Challenge

ఈ మధ్యే బేబీ ఆల్బంకు ఎంతలా కష్టపడ్డాడో కూడా చెప్పాడు. బేబీ ఆల్బంకు అనుకున్న బడ్జెట్ మించిపోయిందని దాదాపు యాభై లక్షల్లో తీసేద్దామని అనుకుంటే అది ఎక్కడికో వెళ్లిపోయింది.. అసలు ఆ బడ్జెట్‌తో ఓ సినిమా కూడా తీసేయొచ్చు. కానీ బేబీ ఆల్బంను అంత గ్రాండ్‌గా తీసినా అందులోనూ నష్టాలే వచ్చాయి.. అప్పులే చేశాను అంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు. తాజాగా రాహుల్ సుమ నిర్వహిస్తోన్న కొత్త షోలో గెస్ట్‌గా వచ్చాడు. అక్కడా కూడా ఇదే విషయాన్ని చెప్పాడు.

సుమ ఈ మధ్య బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అంటూ ఓ కొత్త షోతో మన ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. అందులో మొదటి ఎపిసోడ్‌లో రాహుల్, కౌశల్ ఇద్దరూ గెస్ట్‌లుగా వచ్చారు. అలా అందులో సుమ రాహుల్‌ను ఓ ప్రశ్న అడిగింది. నీ లైఫ్‌లో బిగ్గెస్ట్ చాలెంజ్ ఏంటని ప్రశ్నించింది. ఆల్బమ్స్‌ కోసం అప్పులు చేయడం.. వాటిని తీర్చడం అంటూ సింపుల్‌గా తన కష్టాలను ఒక్క మాటలో చెప్పేశాడు. మొత్తానికి రాహుల్ ఆల్బమ్స్ క్రియేట్ చేయడానికి ఆర్థికంగా ఎంత కష్టపడుతున్నాడో అందరికీ తెలిసేలానే చెప్పేశాడు.

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp