Chanti Movie : చంటి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌ని ఈ హీరో వ‌దులుకున్నాడా.. చాలా బ్యాడ్ ల‌క్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chanti Movie : చంటి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌ని ఈ హీరో వ‌దులుకున్నాడా.. చాలా బ్యాడ్ ల‌క్..!

 Authored By sandeep | The Telugu News | Updated on :24 January 2022,9:30 pm

Chanti Movie : కొంద‌రు హీరోల ద‌గ్గ‌ర‌కు మంచి క‌థ‌లు వ‌చ్చినా కూడా కాల్షీట్స్ లేక‌నో, లేదంటే ఇత‌ర ప‌రిస్థితుల వ‌ల‌ననో నో చెప్పేస్తారు. కాని ఆ సినిమా వేరే హీరో చేయ‌డంతో పెద్ద హిట్ అవుతుంటుంది. ఇలాంటివి ఇండ‌స్ట్రీలో ఎన్నో జ‌ర‌గ‌డం మనం చూస్తూనే ఉన్నాం. తెలుగులోని స్టార్ ప్రొడ్యూసర్స్ లో ఒక‌రైన కేఎస్ రామారావు.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ ద్వారా ఆయన చాలా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమాల్లో భారీ విజయాలను అందుకున్నవే ఎక్కువ. ఆయన బ్యానర్లో వచ్చిన చెప్పుకోదగిన సినిమాల్లో ‘చంటి’ ఒకటి.

ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో వెంకీ ప‌క్క‌న మీనా హీరోయిన్‌. సీనియ‌ర్ హీరోయిన్ సుజాత వెంకీకి త‌ల్లిగా న‌టించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకం చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇందులో చాలా అమాయ‌కంగా న‌టించి అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నాడు వెంక‌టేష్‌. అయితే ఈ సినిమా విడుద‌లై 30 ఏళ్లు పూర్త‌య్యాయి. 1992 సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.ఈ సినిమా 30 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా కేఎస్ రామారావు ఈ సినిమాను గురించిన విశేషాలను గుర్తుచేసుకున్నారు.

rajendra prasad missed block buster movie chanti

rajendra prasad missed block buster movie chanti

Chanti : రాజేంద్ర‌ప్ర‌సాద్ బ్యాడ్ ల‌క్..

తమిళంలో ప్రభు హీరోగా దర్శకుడు పి.వాసు చేసిన ‘చిన్నతంబి’ విజయాన్ని సాధించింది. ఆ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని నేను .. రవిరాజా పినిశెట్టి అనుకున్నాము. రాజేంద్రప్రసాద్ తో పాటు మరికొందరి పేర్లను పరిశీలించాము. ఆ సమయంలో సురేశ్ బాబు గారు .. ఈ సినిమాను వెంకటేశ్ తో చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. ఆయన డేట్స్ ఇస్తే చేయడానికి నేను రెడీ అని చెప్పాను. ఆ తరువాత నుంచి అన్ని పనులు చకచకా జరిగిపోయాయి. ‘చంటి’ పాత్ర కోసం వెంకటేశ్ చాలా కసరత్తు చేశారు అని చెప్పుకొచ్చాడు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది