rakul preet singh : ఆ విషయంలో చాలా సాయం చేశాడు.. హీరోపై రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్స్
rakul preet singh రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం కోలీవుడ్ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. శివకార్తికేయన్ హీరోగా వస్తోన్న అయలాన్ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ డిసెంబర్‌లోనూ పూర్తి చేయాలని భావించినా కూడా ఆలస్యమైంది. జనవరిలోనూ ముందుగానే ఫినిష్ చేయాలని చూసినా కూడా కుదరలేదట. తనకు కరోనా రావడంతో పూర్తి షెడ్యూల్ మారిపోయిందని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చింది. ఈమూవీ షూటింగ్‌లో చివరి పార్ట్ కొద్దిగా మిగిలి ఉందని అది ఇప్పుడు పూర్తయిందని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది అయలాన్ సినిమా సెట్స్, షూటింగ్‌లో జరిగిన ఫన్నీ సంఘటనల గురించి రకుల్ ప్రీత్ సింగ్ వివరించింది.

rakul preet singh about Siva karthikeyan
ఆ హోళీ ఫోటోలు ఎందుకు పోస్ట్ చేసిందో కూడా తెలిపింది. అయలాన్ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ షూటింగ్‌లో భాగంగా అలా రంగులు పూసుకున్నట్టు తెలిపింది. అయలాన్ అద్భుతమైన టీం అని, ఇందులో వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంటుంది, ఆపనులు కూడా ప్రారంభించామని, ముఖ్యంగా ఇది చిన్న పిల్లలకు ఎక్కువగా నచ్చుతుందని రకుల్ చెప్పుకొచ్చింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ గురించి శివ కార్తికేయన్ మాట్లాడుతూ.. ఆమెతో పని చేయడం ఎంతో సంతోషంగా ఉంది.. ఆమె నాకు ఇంగ్లీష్ నేర్పించిందంటూ ట్వీట్ చేశాడు.
rakul preet singh : నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడే వాడు : రకుల్ ప్రీత్ సింగ్
దానిపై రకుల్ స్పందిస్తూ.. ఆయన నాతో ఇంగ్లీష్‌లో మాట్లాడే వాడు.. నేను అతనితో తమిళంలో మాట్లాడేందుకు ప్రయత్నించేదాన్ని. భారీ భారీ డైలాగ్‌లన్నీ కూడా బాగా వివరించే వాడు.. చెన్నైలోని అన్ని ప్రదేశాల గురించి చెప్పేవాడు.. నాకు ఇష్టమైన ఫుడ్‌ను రెడీ చేయించేవాడంటూ… అలా ఎంతో సాయం చేశాడంటూ శివ కార్తికేయన్ గురించిచెప్పింది. ఆయన సెట్‌లోకి వస్తే చాలు వాతావరణం పూర్తిగా మారుతుందని శివ కార్తికేయన్‌పై రకుల్ ప్రశంసలు కురిపించింది.