NTR : రామకృష్ణ సినీ స్టూడియో నిర్మాణాన్ని ఆపింది వీళ్లేనట… ఎన్టీఆర్ ని ఇంతలా ఇబ్బంది పెట్టారా ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NTR : రామకృష్ణ సినీ స్టూడియో నిర్మాణాన్ని ఆపింది వీళ్లేనట… ఎన్టీఆర్ ని ఇంతలా ఇబ్బంది పెట్టారా !

 Authored By prabhas | The Telugu News | Updated on :9 November 2022,3:40 pm

NTR : సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాలు చేసి తెలుగువాడు సత్తా ఏంటో నిరూపించారు. ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేయగలడు. అయితే ఎన్టీఆర్ కుటుంబానికి ఒక సొంత స్టూడియో ఉండేది. ఇది అన్నగారి కుమారుడి పేరుతో రామకృష్ణ సినీ స్టూడియో అని ఏర్పాటు చేసుకున్నారు. మద్రాస్ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి వచ్చేస్తున్న టైం లో అన్నగారు దీనికి నిర్మించాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే దీనికి ముందు అక్కినేని నాగేశ్వరరావే అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించారు అనేది ఒక వాదన. అన్నగారిని చూసి అక్కినేని కట్టారా లేక అక్కినేని సలహాలు విని అన్నగారు నిర్మించారు అనేది ఇప్పటికి ఎవరికీ తెలియదు.

రామకృష్ణ స్టూడియో నిర్మించడానికి అన్నగారికి చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. అందరూ మద్రాస్ నుంచి ఏపీకి వెళ్లిపోవాలని అనుకున్నారు కానీ తాను మాత్రం వెళ్ళలేదు. కాంగ్రెస్ పాలకులు తనను శత్రువులాగా చూస్తున్నారు అని అప్పటి కాంగ్రెస్ నేతలపై అన్నగారు కోపంగా ఉండేవారు. ఇలాంటి సమయంలో అక్కినేని తొలిసారి హైదరాబాద్ వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ నేతల సపోర్ట్ ఉండేది. నిజానికి అక్కినేని కి రాజకీయాలు పడకపోయినా కాంగ్రెస్ నేతలు అతనిని పరిచయం చేసుకొని రాజకీయంగా వాడుకోవాలని అనుసరించారు. ఎలానూ ఎన్టీఆర్ తమ మాట వినేవాడు కాదని నిర్ణయానికి అప్పటి కాంగ్రెస్ నేతలు వచ్చేసారు.

Ramakrishna Cine Studio has stopped the productions did they bother NTR so much

Ramakrishna Cine Studio has stopped the productions did they bother NTR so much

ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు వెళ్ళిపోయింది. షూటింగ్ అంటే మద్రాస్ కి రావాల్సిందే. ఇక్కడే స్టూడియోలు ఉన్నాయి. ఎక్వీప్ మెంట్ ఉన్నాయి. ఈ సమయంలో వెళ్లి రావడం అంటే ఖర్చులు సమయం వృధా అవుతుంది. అందుకే అలాంటి టైం లో అన్నగారు రామకృష్ణ సినీ స్టూడియోస్ నిర్మించాలని అనుకున్నారు. దీనికి కొందరు అడ్డు పడ్డారని అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నగారికి అనుమతి ఇవ్వలేదని అనుకున్న సమయానికి దీనిని పూర్తి కాలేదని చెబుతుంటారు. అయితే నాలుగు సంవత్సరాల తర్వాత అన్నగారు మద్రాస్ టు హైదరాబాద్ తిరుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు హైదరాబాద్లో స్టూడియో ఏర్పడిన తర్వాత అందరికీ అద్దెకివ్వడం ప్రారంభించారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది