Rana daggubati : రానా దగ్గుబాటి విరాట పర్వం రిలీజ్ డేట్ ఫిక్స్..ఇన్ని సినిమాలకంటే ఇదే హైలెట్ ..!
Rana daggubati : రానా దగ్గుబాటి వేణు ఊడుగుల దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ సినిమా విరాట పర్వం. ఫిదా బ్యూటీ సాయిపల్లవి.. నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా విరాట పర్వం నక్సల్ బ్యాగ్రౌండ్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా క్రైసిస్ నేపథ్యంలో చిత్రీకరణ దశలో ఉండగా సినిమా ఆగిపోయింది. కాగా లాక్ డౌన్ తర్వాత బ్యాలెన్స్ టాకీపార్ట్ ని కంప్లీట్ చేసిన చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలని జరుపుతున్నారు.

rana-daggubati-virataparvam release date fixed for rana daggubati virataparvam movie
ఇక ఇప్పటికే విరాట పర్వం సినిమా నుంచి రిలీజ్ చేసిన రానా.. సాయి పల్లవి.. ప్రియమణి పోస్టర్స్ సినిమా మీద ఆసక్తిని రేకెత్తించాయి. కంప్లీట్ నేరచుల్ లుక్స్ లో మేకప్ లేకుండా సినిమాని తెరకెక్కిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక రానా గాని సాయి పల్లవి, ప్రియమణి గాని ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చేయలేదు. అయితే ‘నీది నాది ఒకే కథ’ అనే సినిమాతో ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ ని సంపాదించుకున్నాడు వేణు ఊడుగుల. టాలెంటెడ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ నుంచి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.
Rana daggubati : రెండు సినిమాలతో రాబోతున్న రానా దగ్గుబాటి..!
ఇంతటి టాలెంటెడ్ డైరెక్టర్ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో విరాట పర్వం సినిమాని రూపొందిస్తుండంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా తాజాగా విరాట పర్వం సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ సినిమాని ఏప్రిల్ 30 న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. రిలీజ్ డేట్ తో పాటు పోస్టర్ ని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ఇక రానా నటించిన పాన్ ఇండియన్ సినిమా అరణ్య మార్చ్ 26 న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.