Nithin : నితిన్ దెబ్బైపోతాడనుకున్న వాళ్ళకి బద్దలైపోయిందిగా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nithin : నితిన్ దెబ్బైపోతాడనుకున్న వాళ్ళకి బద్దలైపోయిందిగా..!

 Authored By govind | The Telugu News | Updated on :30 March 2021,10:27 am

Nithin : నితిన్ తాజాగా రంగ్ దే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహానటి సినిమా తర్వాత సౌత్ ఇండస్ట్రీలో బాగా క్రేజ్ సంపాదించుకున్న కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం.. లెజెండ్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరాం కెమెరా వర్క్ సినిమాకి అడిషనల్ అట్రాక్షన్ గా నిలిచాయి. గత ఏడాది భీష్మ సినిమాతో వచ్చిన నితిన్ సాలీడ్ హిట్ అందుకొని వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టాడు. వాటిలో గత నెలలో భారీ అంచనాల మధ్య చెక్ సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా నితిన్ కి గట్టి షాకిచ్చింది. ఎన్నో అంచనాలు పెట్టుకుంటే టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ ఎంచుకున్న కథ నితి కి హిట్ ఇవ్వలేకపోయింది.

దాంతో అందరిలో ఒకటే టాక్. నితిన్ కి రంగ్ దే సినిమా సక్సస్ ఇచ్చి మళ్ళీ సక్సస్ ట్రాక్ ఎక్కిస్తుందా అని. అలా అనుకోవడానికి చెక్ సినిమా రిజల్ట్ ఒకటైతే హీరోయిన్ కీర్తి సురేష్ కి గత కొంతకాలంగా సక్సస్ లు లేకపోవడమే. ఇక దర్శకుడు వెంకీ అట్లూరి కి అఖిల్ తో చేసిన మిస్టర్ మజ్ఞు హిట్ ఇవ్వలేకపోయింది. మ్యూజిక్ పరంగా దేవీశ్రీ మీద కాస్త జనాలలో అసంతృప్తి నెలకొంది. ఇలాంటి నెగిటీవ్ ఫీలింగ్స్ మధ్య రంగ్ దే సినిమాని తెరకెక్కించారు. అయితే చిత్ర యూనిట్ సక్సస్ అయింది ఇవన్నీ పట్టించుకోకుండా సినిమాని జనాలలోకి తీసుకు వెళ్ళడమే.

rangde Movie block buster hit to nithin

rangde Movie block buster hit to nithin

Nithin : నితిన్ రంగ్ దే మంచి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచే కొత్త తరహాలో ప్రమోషన్స్ నిర్వహిస్తూ వచ్చారు. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడినప్పటి నుంచి పీక్స్ లో రంగ్ దే ప్రమోషన్స్ చేయడం బాగా కలిసొచ్చింది. అయితే రానా నటించిన పాన్ ఇండియన్ సినిమా అరణ్య, రాజమౌళి కాంపౌండ్ నుంచి వచ్చిన తెల్లవారితే గురువారం పోటీకి ఉండటంతో ఎక్కడ నితిన్ రంగ్ దే దెబ్బైపోతుందో అని మాట్లాడుకున్నారు. కానీ అరణ్య సినిమా, తెల్లవారితే గురువారం సినిమాలకి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చి మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అదే నితిన్ సినిమాకి ప్లస్ అయింది. మంచి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూసి చాలా రోజులవడంతో రంగ్ దే భారీ హిట్ అన్న టాక్ తెచ్చుకుంది. మరి వసూళ్ళ పరంగా ఏ స్థాయిలో ఉందో తెలియాలి. మొత్తానికి రంగ్ దే నితిన్ ని లాగి ఒడ్డున పడేసిందని చెప్పాలి.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది