Rashmi Gautam : ‘బ్రూనో’ ఏంపాపం చేసింది..కొట్టి చంపేశారు..!
Rashmi Gautam : రష్మి గౌతమ్..తాజాగా జరిగిన ఓ సంఘటన గురించి ప్రస్తావిస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు. బుల్లితెరపై గత కొంతకాలంగా రష్మీ పలు ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు చేస్తూ ప్రేక్షకుల్లో విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకుంది. అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద హీరోయిన్‌గాను కనిపిస్తున్న ఈమెకి మంచి పేరు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తన అందచందాలతో, యాంకరింగ్ తో డాన్సులతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రష్మీ హీరోయిన్‌గా నటించిన ‘గుంటూరు టాకీస్’ ఎప్పుడో వచ్చినా ఇప్పటికీ ఆ సినిమాలో పాటలు, రష్మీ బోల్డ్ పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా హిట్ అవడానికి ముఖ్య కారణం రష్మీ.
ప్రస్తుతం బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో సింగర్ గీతా మాధురి భర్త నందుతో కలిసి నటించింది రష్మీ. ఇప్పటిలో దీనిలోని పాట బాగా ట్రెండ్ అయింది. ఇలా ఒకవైపు సినిమాలు మరొకవైపు బుల్లితెర ప్రోగ్రాంస్ తో బిజీగా ఉంటున్న రష్మీ సామాజిక అంశాలపై కూదా శ్రద్ద చూపిస్తుంటుంది. మహిళలపై జరుగుతున్న అరాచకాల విషయంలో కానీ, మూగ జీవాల సంరక్షణలోగాని ఎప్పటికప్పుడు స్పందిస్తూ.. ట్వీట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంటుంది. ఇది చాలామందిలో కనిపించదు. ఇలాంటి ఓ తాజా సంఘటన గురించి స్పందిస్తూ
ట్వీట్ చేసింది.
Rashmi Gautam : మనుషుల ప్రవర్తన పైనే సిగ్గుగా అనిపిస్తుంది.
‘బ్రూనో’ అనే ఓ కుక్క విషయంలో కేరళ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది రష్మీ. వందశాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రంలో ఇలాంటి చేష్టలు ఏంటీ అంటూ సూటిగా ప్రశ్నించింది రష్మి. అసలు వివరాల్లోకి వెళితే.. ఇటీవల తిరువనంతపురం బీచ్‌లో ముగ్గురు వ్యక్తులు ‘బ్రూనో’ అనే కుక్కని కట్టేసి క్రికెట్ బ్యాట్‌తో అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఆ కుక్కను తర్వాత చేపల గాలానికి వేలాడదీశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సంఘటన గురించి స్పందించిన
రష్మి.. తీవ్ర వేదనకు గురైయారు. ‘ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మనుషుల ప్రవర్తన పైనే సిగ్గుగా అనిపిస్తుంది. బ్రూనో ఏం పాపం చేసింది.. మీకు ఏం అన్యాయం చేసింది అంటూ రష్మీ తీవ్ర అసహనం, ఆవేదన వ్యక్తం చేసింది. ట్విట్టర్‌లో రష్మీ పోస్ట్ కూడా వైరల్ అవుతోంది.
This behavior is not expected out of a state that claims 100 percent literacy
What's happened to
You feed explosives to elephants
You hang alive dogs on fish hooks
Is there any humanity left @KeralaTourism @KeralaGovernor @CMOKerala @KeralaGovernor @INCKerala @CPIMKerala https://t.co/LpZOLwL4q1— rashmi gautam (@rashmigautam27) July 2, 2021