Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ ఫోన్‌లోని సీక్రెట్.. రష్మీ గౌతమ్ నంబర్‌ను అలా పెట్టేసుకున్నాడా?
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ ఇద్దరూ దాదాపు గత పదేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే వస్తున్నారు. ఒకానొక సమయంలో ఈ ఇద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా? అని అనిపించేలా జీవించేశారు. అలా ఈ ఇద్దరూ కలిసి చేసిన ఎన్నో ఈవెంట్లు బుల్లితెరపై బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి.
జనాలు మాత్రం సుధీర్ రష్మీ ఒక్కటైతే చూడాలని అనుకుంటూ ఉంటారు. ఇదే విషయాన్ని అభిమానులు వారి దగ్గర ప్రస్థావిస్తుంటారు. తామిద్దరం కేవలం ఫ్రెండ్సేనని, తెరపై అలా చేసేది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకేనని చెబుతుంటారు. అంతకు మించి తమ మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెబుతుంటారు. ఇక తాజాగా ఓ షోలో ఈ ఇద్దరూ కనిపించారు.

Rashmi Gautam Contact Name In Sudigali Sudheer Phone
Sudigali Sudheer : కొత్త పేరు పెట్టిన సుధీర్..
స్టార్ మాలో చేసిన ఈ ఈవెంట్‌లో కొన్ని పర్సనల్ విషయాలు బయటకు వచ్చాయి. సుధీర్ తన ఫోన్‌లో రష్మీ నంబర్‌ను ఎలా సేవ్ చేసుకున్నాడో చెప్పేశాడు. మామూలుగా రష్మీ అనే సేవ్ చేసుకున్నాడట. కానీ మధ్యలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌లో బిజీగా ఉండటంతో ఓపెనింగ్స్ అని సేవ్ చేసుకున్నాడట. మళ్లీ ఇప్పుడు రష్మీ అనే సేవ్ చేసుకున్నాడట సుధీర్.