Rashmi Guatam : ముద్దుగా బావ అంటూ పిలిచిన రష్మి గౌతమ్.. గాల్లో తేలిపోయిన జబర్దస్త్ కమెడియన్.. వైరల్ వీడియో
Rashmi Guatam , రష్మి గౌతమ్ బుల్లితెరపై ఈ మధ్య ఓ పిచ్చి బాగా ముదిరింది. అడుక్కుని మరీ హగ్గులు తీసుకోవడం, ముద్దు పెట్టమని అడుక్కోవడం వంచి ఘటనలన్నీ ఎక్కువవుతున్నాయి. మొన్నటికి మొన్న ఢీ షోలో హైపర్ ఆది, సుధీర్‌లు హగ్గుల కోసం పడిచచ్చారు. ఇక తాజాగా జబర్దస్త్‌లోనూ ఓ ఓల్డ్ కమెడియన్ కూడా అదే బాట పట్టాడు. చమ్మక్ చంద్ర స్కిట్‌లో చేసిన సత్తిపండు ఇప్పుడు టీం లీడర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే.

rashmi Guatam fun with Satthi pandu In Extra Jabardasth
చమ్మక్ చంద్ర జబర్దస్త్‌ను వదిలిన తరువాత సత్తిపండుకు దశ తిరిగింది. అయితే సత్తిపండు కూడా కొత్తగా ఏమీ ఆలోచించడం లేదు. చమ్మక్ చంద్ర ఫార్మూలాను వాడుతున్నాడు. ఫ్రస్ట్రేటెడ్ భర్తగా నటిస్తూ లాక్కొస్తున్నాడు. అయితే తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సత్తి పండు తనలోని కోరికను బయటపెట్టేశాడు. ముసలి వాడైనా సరే రష్మి గౌతమ్ చేత బావ అని పిలుచుకోవాలని ఉబలాటపడ్డాడు.
స్కిట్‌లో భాగంగా సత్తి పండు రష్మి గౌతమ్ ని ఆట పట్డించాడు. ఒక్క సారి బావ అని పిలవచ్చు కదా? అని సత్తిపండు అడుక్కున్నాడు. దీంతో రష్మి గౌతమ్ పప్పులో కాలేసింది. నేను అలా అస్సలు పిలవను అంటూనే చివరకు నోరు జారీ బావ అనేసింది. దీంతో సదరు ఓల్డ్ కమెడియన్ గాల్లో తేలిపోయాడు. రష్మి గౌతమ్ అలా నోరు జారి బావ అనడంతో మనో, రోజా ఇద్దరూ కూడా పగలబడి నవ్వేశారు. మొత్తానికి రష్మి గౌతమ్ చేత బావ అనిపించుకున్నాడు సత్తిపండు.
