Rashmika Mandanna : షూటింగ్ అయిపోయాక రాత్రి అదే పని..? రష్మిక మందన్నా
Rashmika Mandanna తెలుగు తెరపై కన్నడ బ్యూటీల హవా బాగానే నడుస్తోంది. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పేరు రష్మిక మందన్న. ‘చలో’ అంటూ నాగ శౌర్య సరసన రొమాన్స్ చేసి టాలీవుడ్ గడపతొక్కిన ఈ బ్యూటీ.. ఇక ఆ తర్వాత ఎక్కడా వెనుతిరిగి చూసిందే లేదు. వరుసపెట్టి స్టార్ హీరోల సరసన ఆఫర్స్ పట్టేస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. మరి ఈ బ్యూటీకి ఇంతలా ఆఫర్స్ రావడానికి కారణాలేంటి? దర్శకనిర్మాతలు ఆమెనే ఎందుకు అంతలా లైక్ చేస్తున్నారంటే చాలా విషయాలు చెప్పుకోవాలి.

rashmika mandanna night time workouts
కన్నడ భామనే అయినా కెమెరా ముందు తెలుగు హావభావాలు పలికించడంలో సక్సెస్ అయింది రష్మిక. అలాగే ఫిట్ నెస్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటూ శరీరాకృతిని కాపాడుకుంటూ వస్తోంది. ఏ సినిమాలో చూసినా ఓ ఫ్రెష్ లుక్ లో కనిపించడం అమ్మడి స్పెషాలిటీ. మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లో ఉండే రష్మిక తాజాగా ఓ విషయమై ఓపెన్ అయింది.
Rashmika Mandanna రష్మిక వర్కవుట్స్

rashmika mandanna night time workouts
తాను షూటింగ్ ఫినిష్ అయ్యాక కూడా రాత్రి పూట జిమ్ లో చెమటోడ్చుతానని చెబుతూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. వర్కవుట్స్ అనేవి రాత్రి 9 గంటల తర్వాత కూడా జరుగుతాయని చెప్పింది. దీంతో రష్మిక ఫిట్ నెస్ సీక్రెట్ ఇదా? శరీర సౌష్టవం కోసం ఇంతలా కష్టపడుతుందా? అని చెప్పుకుంటున్నారు జనం. ప్రస్తుతం ఈ అమ్మడు ”పుష్ప, ఆడవాళ్ళూ మీకు జోహార్లు” సినిమాలు చేస్తోంది.