Ravi Teja : అప్పట్లో ఆ హీరోయిన్ కోసం తన భార్యతో కూడా గొడవ పడ్డ హీరో రవితేజ ?
Ravi Teja : టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్ హీరోగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ ప్రారంభించిన రవితేజ ఆ తర్వాత పలు సినిమాలలో చిన్నచిన్న క్యారెక్టర్స్ చేస్తూ అడపా దడపా సినిమాలలో హీరోగా చేస్తూ వచ్చాడు. అలా ‘ ఇడియట్ ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. అప్పటినుంచి తన కెరీర్ పూర్తిగా మారిపోయింది.ఆ సినిమా తర్వాత రవితేజ కెరియర్ లో ఎన్నో హిట్లు, ఫ్లాప్ లు, బ్లాక్ బస్టర్ హిట్లు పడ్డాయి. ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ స్థాయి నుండి ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగిన రవితేజ ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయం అని చెప్పవచ్చు. ఇక సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక ఏ హీరో పై అయినా రూమర్స్ రావడం కామన్. రవితేజ మీద కూడా అప్పట్లో ఒక రూమర్ క్రియేట్ అయింది.
ఆయన స్టార్ హీరోయిన్ అనుష్కతో డేటింగ్ చేస్తున్నాడని, వీళ్లిద్దరు ముంబైలో ఒక ప్రముఖ స్టార్ హోటల్లో ఉంటూ కెమెరాలకు చిక్కుకున్నారని అప్పట్లో ఓ రూమర్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.ఆ రూమార్ కాస్త రవితేజ ఇంట్లో వాళ్లకి తెలిసి పెద్ద గొడవ జరిగిందట. ఆ రూమర్ క్రియేట్ అవ్వడానికి కారణం రవితేజ ఓ ఇంటర్వ్యూలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు అని అడగగా దానికి బదులుగా అనుష్క అంటే నాకు చాలా ఇష్టం అని, ఆమె నటన చాలా బాగుంటుందని, అంతే కాకుండా ఆమె నాకు మంచి స్నేహితురాలు అని కూడా చెప్పాడు. ఇక అప్పటినుంచి వీరిద్దరిపై రూమార్స్ క్రియేట్ అయ్యాయి.
తరువాత ఈ రూమర్స్ అన్నింటికి చెక్కు పడేలా రవితేజ క్లారిటీ ఇచ్చారట. ఇకపోతే రవితేజ ఇటీవల ‘ ధమాకా ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు, ఆ తరువాత ‘ రావణాసుర ‘ సినిమాతో డీలా పడిపోయాడు. ప్రస్తుతం మరో సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు.