రవితేజ నే సంక్రాంతి విన్నర్ అని ఇండస్ట్రీ మొత్తం ఫిక్సైపోయిందిగా ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

రవితేజ నే సంక్రాంతి విన్నర్ అని ఇండస్ట్రీ మొత్తం ఫిక్సైపోయిందిగా ..!

 Authored By govind | The Telugu News | Updated on :5 January 2021,10:27 am

రవితేజ క్రాక్ సినిమాతో సంక్రాంతి రేస్ లో రాబోతున్న సంగతి తెల్సిందే. రవితేజ – గోపీచంద్ మలినేని కలిసి చేస్తున్న క్రాక్ మీద ఇండస్ట్రీ వర్గాలలో భారీగానే అంచనాలున్నాయి. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ కి మళ్ళీ భారీ కమర్షియల్ హిట్ దక్కలేదన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి క్రాక్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్ఠించబోతున్నాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. బలుపు, డాన్ శీను కాంబినేషన్ మళ్ళీ రిటీటవుతోంది. రవితేజ – గోపీచంద్ మలినేని హ్యాట్రిక్ హిట్ కొట్టబోతున్నామన్న ధీమాగా ఉన్నారు.

Ravi Teja and Shruti Haasan's Krack Sankranti poster released | Telugu Movie News - Times of India

ఇప్పటికే ఎస్ ఎస్ థమన్ సంగీతమందించిన సాంగ్స్ మాస్ ఆడియన్స్ ని ఊర మాస్ స్టెప్పులేయిస్తున్నాయి. ఇక ఈ సినిమాతో రవితేజ – థమన్ ల కాంబినేషన్ కూడా రిటీటవుతోంది. మిరపకాయ్ సినిమాతో మొదలైన రవితేజ – థమన్ కాంబోలో ఇప్పటికే 10 సినిమాలొచ్చి బ్లాక్ బస్టర్ ఆడియో హిట్స్ సాధించారు. ఇప్పుడు క్రాక్ ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న 11 వ సినిమా కావడం విశేషం. కాగా తాజాగా ఈ సినిమా నుంచి మాస్ బిర్యాని అన్న సాంగ్ రిలీజై విపరీతంగా ఆకట్టుకుంటోంది.

YouTube video

ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు ఖచ్చితంగా సంక్రాంతి బరిలో భారీ హిట్ అందుకునేది రవితేజ నే అని చెప్పుకుంటున్నారు. క్రాక్ ట్రైలర్ చూసిన తర్వాత అందరూ ఫస్ట్ క్రాక్ సినిమా చూసేందుకే రెడీ అవుతున్నారు. అంతేకాదు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 అనుకున్న రిలీజ్ కాస్త ఇంకా ముందు జరిగి జనవరి 9 నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి రవితేజ క్రాక్ సినిమా మీదే ఉంది. ఇక ఈ సినిమా తో పాటు రాం రెడ్ సినిమా, రానా అరణ్య కూడా రిలీజ్ కాబోతున్నాయి. కాని సంక్రాంతి విన్నర్ మాత్రం రవితేజ అని అందరు గట్టిగా ఫిక్సవుతున్నారు.

 

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది