Ravi Teja : రవితేజ ఆ విషయం ను గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చినట్లుంది
Ravi Teja : మాస్ మహారాజా రవితేజ గతమెంతో ఘనం అన్నట్లుగా పరిస్థితి మారింది. గతంలో ఆయన సంవత్సరానికి ఐదారు సినిమాలు విడుదల చేసిన కూడా వరుసగా భారీ విజయాలను దక్కించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన సినిమాల్లో ఎక్కువ శాతం సక్సెస్ రేటు ఉండడం వల్ల ఆయనతో సినిమాలు నిర్మించేందుకు, ఆయన సినిమాలకు దర్శకత్వం వహించేందుకు, ఆయనతో నటించేందుకు చాలా మంది ముందుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వరుసగా పరాజయాలు అవుతున్న నేపథ్యంలో నిర్మాతలు ఈయనతో సినిమా అంటే భయపడుతున్నారు.
మరోవైపు ఈయన తాజా సినిమాలు వసూళ్లు సాధించడం లో బొక్కబోర్లాపడుతున్నాయి. ఆ మధ్య వచ్చిన కిలాడీ తాజాగా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ ఈ రెండు సినిమాలు కూడా వసూళ్ళ పరంగా దారుణమైన ఫలితాన్ని చవి చూశాయి. ఆ కారణంగానే రవితేజతో సినిమా అంటే నిర్మాతలు కాస్త వెనకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి. వాటిల్లో సినిమాల్లో టైగర్ నాగేశ్వరరావు మరియు రాక్షసుడు అని సినిమాలపై ఆసక్తి జనాల్లో కనిపిస్తుంది. అవి కాకుండా మరో రెండు సినిమాల్లో కూడా ఈయన నటిస్తున్నాడు. కానీ అవి ఎంత వరకు వర్కౌట్ అవుతాయి అనే విషయంలో క్లారిటీ లేదు.
ఈ సమయంలో రవితేజ ఖచ్చితంగా తన సెకండ్ ఇన్నింగ్స్ కు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోవాలంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యంగ్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయడం మొదలు కొని విలన్ పాత్రలు మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయడం ద్వారా టాలీవుడ్ లో మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంటుందని అభిమానులు సూచిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి తో ఒక సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రవితేజ అదే పద్దతిని కొనసాగించాలని కొందరు సలహా ఇస్తున్నారు. ఈ సలహాలు రవితేజ ఎంత వరకు స్వాగతిస్తారు అనేది చూడాలి.