Tiger Nageswara Rao Movie : రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాపై జనాల కామెంట్స్ .. హిట్టా, ఫట్టా ..??
Tiger Nageswara Rao Movie : రవితేజ హీరోగా వంశీ దర్శకత్వం వహించిన ‘ టైగర్ నాగేశ్వరరావు ‘ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో ఫస్ట్ టైం రవితేజ పాన్ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1980 దశకానికి చెందిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహించారు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లుగా నటించారు. రేణు దేశాయ్ కీలక పాత్రలో పోషించింది. ఈ ఫిక్షనల్ బయోపిక్ ప్రీమియర్ టాక్ ఎలా ఉంది అంటే తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ జీవించాడని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.
రాబిన్ హుడ్ క్యారెక్టర్ తో రవితేజ తన నటనతో రప్పాడించాడని రవితేజ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫామెన్స్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. అతడి ఎంట్రీ స్క్రీన్ ప్రజెన్స్, ఎలివేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ తోపాటు యాక్షన్ సీక్వెన్స్ టైగర్ నాగేశ్వరరావు సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని కామెంట్స్ చేస్తున్నారు. 1980 కాలాన్ని అద్భుతంగా సినిమాలో రీ క్రియేట్ చేశారని అంటున్నారు. ఎలివేషన్ తో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు.
రవితేజ రేణు దేశాయ్ తో పాటు మిగిలిన క్యారెక్టర్స్ డిజైన్ చేసిన తీరు బాగుందని పేర్కొంటున్నారు. అయితే ఈ సినిమాకి సెకండ్ హాఫ్ మైనస్ గా ఉందని ఆడియన్స్ పేర్కొంటున్నారు. సెకండ్ హాఫ్ ను డైరెక్టర్ బాగా సాగదీశారని, మెయిన్ కాన్సెప్ట్ సరిగ్గా క్లిక్ అవ్వలేదని, మూడు గంటలకు పైగా ఉన్న నిడివి కూడా ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. ముఖ్యంగా పాటలు, బిజిఎం సినిమాకి పెద్ద డ్రాబ్యాక్ గా చెబుతున్నారు. విఎఫ్ఎక్స్ విషయంలో క్వాలిటీ మిస్ అయిందని చిన్నచిన్న లోపాలు ఉన్న మంచి పిరియాడిక్గా డ్రామాగా ఈ సినిమా ఆడియోన్స్ ను అలరిస్తుందని అంటున్నారు. ఇక రవితేజ అభిమానులకు ఈ సినిమా పూర్తిగా నచ్చుతుందని ఓవర్సీస్ లో ఆడియన్స్ ట్వీట్ చేస్తున్నారు.