Mutton pulao : రెస్టారెంట్ స్టైల్ లో మటన్ పులావ్… ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ అదిరిపోద్ది..
Mutton pulao : కొన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ను ఎక్కువగా రెస్టారెంట్ లోనే తింటూ ఉంటారు. అలాంటి ఐటమ్స్ మనం కూడా ఇంట్లో ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్ లో చేసుకొని తినవచ్చు. ఆ వెరైటీ ఏమిటంటే మటన్ పులావ్. దీని రెస్టారెంట్ స్టైల్లో ఏవిధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు : మటన్, పెరుగు, నిమ్మరసం, కారం, ఉప్పు, పసుపు ,అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి ,ధనియా పొడి ,గరం మసాలా, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, మిరియాలు, నల్లయాలకులు, జాజిపత్రి, అనాసపువ్వు, సాజీర, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, బాస్మతి రైస్ మొదలైనవి. తయారీ విధానం : ముందుగా కేజీ మటన్ తీసుకొని దానిలో ఒక కప్పు పెరుగు, రెండు స్పూన్ల నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, రెండు స్పూన్ల కారం, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం ఆయిల్ అన్నీ వేసి బాగా కలిపి గంట వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ పై ఒక కుక్కర్ ను పెట్టి దానిలో రెండు స్పూన్లు నెయ్యి, రెండు స్పూన్ల ఆయిల్ వేసి ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి.
తర్వాత దానిలో బిర్యానీ ఆకులు రెండు, నల్ల యాలకులు రెండు, జాపత్రి ఒకటి, అనాసపువ్వు ఒకటి, నాలుగు మిరియాలు, సాజీర ,రెండు లవంగాలు, ఇలా మసాలా దినుసుల్ని వేసి బాగా వేయించుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ దీనిలో వేసి బాగా కలుపుకొని కుక్కర్ రబ్బర్ తీసేసి మూత పెట్టుకొని 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. తర్వాత రెండు కప్పుల నీటిని వేసి మరల మూతకి రబ్బరు పెట్టి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ ను తీసుకొని వాటిలో నీటిని వంపేసి ఆ బియ్యాన్ని దాన్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత రెండు గ్లాసులకి రెండు గ్లాసుల నీటిని పోసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చిన తర్వాత రెండవ విజిల్ రాకముందే స్టవ్ ఆపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి దానిలో కొత్తిమీర పుదీనా చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో ఈజీగా రెస్టారెంట్ స్టైల్ లో మటన్ పులావ్ రెడీ.