Dangerous Movie Trailer Review : ప్రేమ అమ్మాయిల మధ్య కూడా ఉంటుందని చెప్పిన ఆర్జీవీ డేంజరస్..
Dangerous Movie Trailer Review : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచనానికి తెరలేపాడు. తొలిసారి వెండితెరపై ‘లెస్బియన్ రొమాన్స్’ను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించాడు. ఆర్జీవీ డేంజరస్ పేరుతో వస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా యూట్యూబ్‌లో విడుదలైంది. ఎప్పటిలాగానే ఈ మూవీలోనూ క్రైం థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమ, రొమాన్స్ అనే కొత్త అంశాన్ని జోడించాడు.సాధారణంగా అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకోవడం ప్రతీ సినిమాలో కామన్. గతం నుంచి వర్తమానం వరకు ఇదే ఫార్ములా కొనసాగుతోంది.

RGV Dangerous Movie Official Trailer
కానీ, ఫస్ట్ టైం ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ , రొమాన్స్ నేపథ్యంలో ‘లెస్బియన్స్’ జీవితాలను వెండితెరపై ఆవిష్కరించనున్నాడు రాము. ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే వారి మధ్య రొమాన్స్, ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ప్రపంచానికి చూపించేందుకు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో నటీనటులుగా అప్సరా రాణి, నైనా గంగూలీ యాక్ట్ చేశారు. ఆ మూవీ ఆద్యంతం లెస్బియన్స్ లవ్, రొమాన్స్, క్రైం థ్రిల్లర్ నేపథ్యంలో సాగనున్నట్టు ట్రైలర్ చూడగానే ఎవరికైనా అర్థం అవుతుంది.
Dangerous Movie Trailer Review లె లవ్ అంటే..

RGV Dangerous Movie Official Trailer
ఈ ట్రైలర్ మగవారు ఆడవారిని బలహీనులు ఎందుకు చూస్తారో.. ప్రేమ అనే పదం పేరుతో సెక్స్ కోరికలు ఎలా తీర్చుకుంటారో ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించడానికి ట్రై చేశాడు ఆర్జీవీ. ట్రైలర్ చివరలో ‘లవ్ ఇస్ లవ్.. నో మ్యాటర్ బిట్‌విన్ హూమ్’ అనే కోటేషన్ ఇచ్చాడు. అనగా ప్రేమ అనేది అమ్మాయి, అబ్బాయి మధ్యలో ఉండేది మాత్రమే కాదని.. ఇద్దరు అమ్మాయిల మధ్య ఉన్న అది ప్రేమగానే పరిగణించబడుతుందని ఒక్క వర్డ్‌లో చెప్పేశాడు. కాగా, రామ్ గోపాల్ వర్మ తీసే ప్రతీసినిమా ఏదో ఒక కాంట్రవర్సీకి కారణం అవుతుంది. ఆర్జీవీ డేంజరెస్ మూవీ విడుదలయ్యాక ఇంకెన్ని వివాదాలకు కారణమవుతుందో వేచిచూడాల్సిందే.
