RGV : ఆసక్తికరంగా ‘వెన్నుపోటు ఈటలు’ పోస్టర్ .. క్లారిటీనిచ్చిన రాంగోపాల్ వర్మ
RGV : టాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలకు ఎప్పుడూ కేరాఫ్‌గా ఉండే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ప్రజెంట్ ఆయన కాంగ్రెస్ లీడర్ కొండా సురేఖ-మురళీధర్‌రావుపై ‘కొండా’ అనే బయోపిక్ తీస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ షురూ అయింది. తెలంగాణలోని పరకాల నియోజకవర్గంలోని వంచనగిరి గ్రామంలో సినిమాకు సంబంధించిన సీన్లు చిత్రీకరిస్తున్నారు. కాగా, రాంగోపాల్ వర్మ నెక్స్ట్ మూవీ గురించి పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా, ఆ విషయమై స్పందించాడు డైరెక్టర్ ఆర్జీవీ.వర్తమాన రాజకీయ అంశాలపై సినిమాలు తీసేందుకుగాను ఆర్జీవీ ఎప్పుడూ ఆసక్తి చూపుతుంటారు. కాగా, ఇటీవల కాలంలో తాను తెలంగాణ రాజకీయ మేధావులతో చర్చించి ‘వెన్నుపోటు ఈటలు’ టైటిల్‌తో ఓ సినిమా తీస్తానని ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ ట్వీట్ చేశారు.

rgv given clarity on etela rajender biopic Movie
తనకు ఈటల రాజేందర్ తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లు అనిపిస్తుందని, అది చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ మాదిరిగా అనిపిస్తుందని, ఈ నేపథ్యంలో తాను మేధావులతో చర్చించి సినిమా తీద్దామని నిర్ణయించుకున్నానని ఆర్జీవీ పేర్కొన్నాడు. కాగా, తాజాగా ‘వెన్నుపోటు ఈటలు’కు సంబంధించిన పోస్టర్ ఇదిగో అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. సదరు పోస్టర్ చూసి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ వార్తలపై డైరెక్టర్ ఆర్జీవీ స్పందించారు. తన పేరుతో ఎవరో కొందరు అకౌంట్ క్రియేట్ చేసి పోస్టర్ రిలీజ్ చేశారని, తాను ఈటల ఎపిసోడ్‌పై సినిమా చేయడం లేదని క్లారిటీనిచ్చారు.
RGV : సోషల్ మీడియాలో ‘ఈటల రాజేందర్’ సినిమాపై డిస్కషన్..

rgv given clarity on etela rajender biopic Movie
దాంతో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఫేక్ వార్తలకు కౌంటర్ పడింది. ఆర్జీవి ప్రజెంట్ ‘కొండా’ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇకపోతే మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జాల నేపథ్యంలో టీఆర్ఎస్‌కు, తన హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. ఇక ఉప ఎన్నిక అనివార్యం కాగా ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ తరఫున బరిలో ఉండగా, ఆయన గెలుపుపైన తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతున్నది.