Roja : జబర్దస్త్‌ కు ముందు.. జబర్దస్త్‌ కు తర్వాత రోజాలో మార్పు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja : జబర్దస్త్‌ కు ముందు.. జబర్దస్త్‌ కు తర్వాత రోజాలో మార్పు

 Authored By prabhas | The Telugu News | Updated on :15 April 2022,7:04 pm

Roja : జబర్దస్త్ కార్యక్రమం నుండి జడ్జి గా రోజా గుడ్బై చెప్పేసిన్నట్లే అని క్లారిటీ వచ్చేసింది. తాజాగా టెలికాస్ట్ అయిన ప్రోమో తో ఆ విషయం స్పష్టత వచ్చింది. ఆ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా ఇక్కడ నుండి అయ్యాను అంటూ మంత్రి రోజా కన్నీళ్లు పెట్టుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జబర్దస్త్ ప్రారంభమైన సమయంలో ఆమె ఒక చిన్న రాజకీయ నాయకురాలు.. కానీ ఇప్పుడు ఆమె ఒక మంత్రి.

జబర్దస్త్ ప్రారంభానికి ముందు చాలా రోజుల పాటు ఆమె రాజకీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆమె మొదట ఎంట్రీ ఇచ్చినా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొని ఆ తర్వాత కాంగ్రెస్ లో అడుగు పెట్టారు. కాంగ్రెస్ లోకి వెళ్ళిన వెంటనే వైఎస్ రాజశేఖర్రెడ్డి మృతి చెందడంతో ఆమె ను ఐరన్లెగ్ అంటూ అందరూ చిత్రీకరించనున్నారు. ఆ సమయంలోనే వైఎస్ జగన్ పిలిచి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆయనకు మద్దతుగా నిలుస్తూ ఆయన వెంట నడుస్తూ వచ్చారు.

RK Roja journey before jabardasth and after jabardasth

RK Roja journey before jabardasth and after jabardasth

అందుకే ఆయనకు ఇప్పుడు రోజా కు మంత్రి పదవి ఇచ్చి తన మాట నిలుపుకున్నారు. కేవలం జబర్దస్త్ కార్యక్రమం లో జడ్జ్‌ గా వ్యవహరించడం వల్లే ఆమెకి ఈ స్థాయి గుర్తింపు వచ్చింది అనడంలో సందేహం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ లో రోజా కనిపించకపోతే జనాల్లో ఎప్పుడో కనుమరుగు అయ్యేది. కానీ రెగ్యులర్ గా జబర్దస్త్ లో కనిపించడం వల్ల ఈ స్థాయికి వచ్చింది. ఆ విషయాన్ని స్వయంగా ఆమె మాటల ద్వారా అర్ధం అవుతోంది. జబర్దస్త్ నుండి ఎమ్మెల్యేగా మంత్రిగా అయ్యాను అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆ గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాయంటూ జబర్దస్త్ కామెడియన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది