Rocking Rakesh : జబర్దస్త్ రాకింగ్ రాకేష్ పారితోషికం… మరీ అంత తక్కువనా?
Rocking Rakesh : జబర్దస్త్ కామెడీ షో లో కనిపించే కమెడియన్స్ లో అతి కొద్ది మందికి మాత్రమే మంచి రెమ్యూనరేషన్ దక్కుతుందట. ఎక్కువ శాతం మందికి రోజు వారి పారితోషికం చాలా తక్కువగా ఉంటుందని మల్లెమాల నుండి బయటకు వచ్చేసిన వారు పలు ఇంటర్వ్యూ లో చెబుతున్నారు. తాజాగా రాకింగ్ రాకేష్ యొక్క రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. టీమ్ లీడర్స్ లో ఇద్దరు ముగ్గురికి మాత్రమే మంచి రెమ్యూనరేషన్ దక్కుతుందని, ఇతర టీం లీడర్స్ కి చాలా తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని, ఆ రెమ్యూనరేషన్ తమ టీమ్ మెంబర్స్ కి షేర్ చేయడానికి కూడా సరిపోవడం లేదని వాపోతున్నారట.రాకింగ్ రాకేష్ టీమ్ లో సుజాత, ప్రవీణ్ అప్పుడప్పుడు ఇతర కమెడియన్స్ వస్తూ ఉంటారు.
వాళ్లకు ఇవ్వంగా రాకేష్ వద్ద ఒక్కొక్క స్కిట్ కి చాలా తక్కువ మిగులుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే జబర్దస్త్ లో పారితోషికం ముఖ్యం కాదు, అక్కడ కనిపించడం ముఖ్యం. ఒకసారి జబర్దస్త్ లో కనిపిస్తే లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తో సమానం అనడంలో సందేహం లేదు. ఆ గుర్తింపుతో బయట తెలివి ఉపయోగించి చాలానే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ మొదలుకొని స్టేజ్ కార్యక్రమాల వరకు అన్నింటికీ హాజరవుతూ అన్నిట్లో వేలు పెడుతూ వేలకు వేల రూపాయలు వెనకేసుకోవచ్చు .ఆ విషయంలో ఇప్పటికే చాలా మంది కమెడియన్స్ అమలు చేసి చూస్తున్నారు. అదే విధంగా రాకింగ్ రాకేష్ కూడా అమలు చేస్తాడు. జబర్దస్త్ ద్వారా ఆయనకు కేవలం గుర్తింపు మాత్రమే వచ్చింది.
రెమ్యూనరేషన్ బాగానే ఇస్తున్నా కూడా అది టీం మెంబెర్స్ కి మాత్రమే సరిపోతుందట. ఇతర కార్యక్రమాల్లో కనిపించడం ద్వారా రాకేష్ కి మంచి రెమ్యూనరేషన్ వస్తుందని.. తద్వారా తన లైఫ్ చాలా బిందాస్ గా సాగుతుందని స్నేహితుల వద్ద అంటున్నాడట. బిగ్బాస్ వంటి కార్యక్రమం నుండి ఆఫర్స్ వచ్చినా కూడా నో చెబుతూ వస్తున్న రాకింగ్ రాకేష్ సుదీర్ఘ కాలంగా ఈటీవీ మరియు మల్లెమాల తో కలిసి వర్క్ చేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా ఈటీవీని వదిలి వెళ్ళి పోయేది లేదు అంటూ రాకింగ్ రాకేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మొత్తానికి జబర్దస్త్ కమెడియన్స్ మల్లెమాల వారిచ్చే రెమ్యూనరేషన్ తో కాకుండా జబర్దస్త్ తో వచ్చిన స్టార్డం మరియు క్రేజ్ తో జీవితాన్ని బిందాస్ గా గడిపిస్తున్నారన్నమాట.