Sudigali sudheer : సుడిగాలి సుధీర్ కు దారుణమైన అవమానం.. అలా కించపరిచిన రోజా
Sudigali sudheer : తెలుగు బుల్లితెర పై గత కొన్ని సంవత్సరాలుగా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకొని అత్యధిక రేటింగ్స్ దూసుకుపోతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. మొదట ఈ కార్యక్రమం కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇకపోతే తాజాగా వచ్చేవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సాధారణంగా జబర్దస్త్ కార్యక్రమానికి అనసూయ లేదా రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తారు. కానీ ఈ ప్రోమోలో సుడిగాలి సుధీర్ యాంకర్ గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సుధీర్ వెల్కమ్ టూ జబర్దస్త్ కార్యక్రమం అనగానే వెంటనే జడ్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి రోజా, మనో వారి సీట్లలో నుంచి లేచి వెళ్ళిపోతారు. అదేంటి అలా అని అడగడంతో అసలే నువ్వు యాంకరింగ్ చేసినట్లు ఉన్నావ్ కదా అది చూసే ధైర్యం మాకు లేదు బాబోయ్ అంటూ రోజా సుడిగాలి సుదీర్ ను దారుణంగా అవమానపరిచింది.

Roja comments on sudigali sudheer anchoring in latest promo
Sudigali sudheer : సుధీర్ యాంకరింగ్ పై రోజా జబర్దస్త్ పంచ్:
అయితే సుడిగాలి సుదీర్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించేవారు. ఈ కార్యక్రమంలో సుధీర్ వెల్కమ్ టూ శ్రీదేవి డ్రామా కంపెనీ సూపర్ సూపర్ అంటూ చెప్పడంతో తనని రాకెట్ రాఘవ కొడుకు ఏంటి నీ యాంకరింగ్ అంటూ ఇమిటేట్ చేస్తూ అవమాన పరిచారు. ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ కార్యక్రమంలోకి కూడా యాంకర్ గా రావడంతో రోజా కూడా తనని నీ యాంకరింగ్ చూసే ధైర్యం మాకు లేదు అంటూ సుధీర్ దారుణంగా అవమానపరిచింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.