Roja Daughter : స్టారో హీరో తనయుడితో రోజా కూతురు రొమాన్స్.. సినీ ఎంట్రీ అప్పుడే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja Daughter : స్టారో హీరో తనయుడితో రోజా కూతురు రొమాన్స్.. సినీ ఎంట్రీ అప్పుడే!

 Authored By mallesh | The Telugu News | Updated on :21 August 2022,9:20 pm

Roja Daughter : టాలీవుడ్ హీరోయిన్ రోజా సెల్వమణి ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా మారిపోయింది. ఏపీ ప్రభుత్వంలో రోజా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి రాకముందు రోజా సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. స్టారో హీరోలందరితో రోజా కలిసి నటించింది. టాలీవుడ్‌తో పాటే తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటించిన రోజా మంచి పేరు సంపాదించుకుంది.

Roja Daughter : రోజా కూతురి ఇండస్ట్రీ ఎంట్రీ..

తెలుగు చిత్ర పరిశ్రమలో రోజా రెండు ద‌శాబ్దాల పాటు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అస‌లు రోజా అంటేనే అందంతో పాటు అభిన‌యంలో కూడా తిరుగులేని నటి. కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలోనే రోజా..కొలీవుడ్ డైరెక్ట‌ర్ సెల్వ‌మ‌ణిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ త‌ర్వాత పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా వైసీపీ పార్టీలో చేరి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మంత్రిగా ప్రమోషన్ కొట్టేసింది. రోజాకు మంత్రి స్థాయికి ఎదగడానికి ఆమె చాలా కష్టపడింది. రోజా సెల్వమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. రోజా కుమార్తె అన్షు మాలిక, ఒక బాబు ఉన్నారు.అయితే,ప్ర‌స్తుతం ఆమె వెండి తెరపై అరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉంద‌ని టాక్ వినిపిస్తోంది. అన్షును హీరోయిన్‌గా చేసేందుకు రోజా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోందని వార్తలు వస్తున్నాయి.

Roja Daughter romance with the star hero son movie entry

Roja Daughter romance with the star hero son movie entry

త‌న న‌ట వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ కుమార్తెను రోజా హీరోయిన్‌ను చేసే ట్రయల్స్‌లో ఉంద‌ని ప్రచారం సాగుతోంది. అన్షు మాలిక ఇప్ప‌టికే అమెరికాలో ఫేమస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు రావ‌డంతో అక్క‌డ ట్రైనింగ్‌లో శిక్ష‌ణ పొందుతోంది. అక్క‌డ నుంచి వ‌చ్చిన వెంటనే ఆమె సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని టాక్. టాలీవుడ్‌లో స్టార్ హీరో తనయుడితో త్వరలోనే రోజా కూతురు రొమాన్స్ చేయనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.నిన్న‌టి త‌రం హీరోయిన్ల‌లో మేనక కూతురు కీర్తి సురేష్‌, రాధ కూతుర్లు తుల‌సి, కార్తీక‌.. మంజుల కూతుర్లు ముగ్గురు, శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్ హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. వీరందరిలో కీర్తీ సురేశ్ మినహా పెద్దగా ఎవరూ క్లిక్ కాలేదు.మరి రోజా కూతురు ఇండస్ట్రీలో సత్తా చాటుతుందో లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

Also read

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది