Balakrishna – Roja : బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో రోజా కూతురు అన్షు.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన రోజా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna – Roja : బాలయ్య కొడుకు మోక్షజ్ఞతో రోజా కూతురు అన్షు.. ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన రోజా

 Authored By kranthi | The Telugu News | Updated on :18 November 2022,8:20 pm

Balakrishna – Roja : ఒక సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన నటి ఆర్కే రోజా. కానీ.. ఇప్పుడు తను రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. ఏపీ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తోంది రోజా. అటు సినీ, ఇటు రాజకీయ రంగాల్లో సినీ నటి రోజా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం తను మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న రోజా మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి పుట్టిన రోజు జరుపుకుంటున్నానని, అందుకే శ్రీవారిని దర్శించుకునేందుకు, ఆయన ఆశీస్సుల కోసం వచ్చానని చెప్పుకొచ్చారు రోజా. అయితే.. తన కూతురు అన్షు మాలికను త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తనకు ఈ ప్రశ్న అక్కడ ఎదురైంది. దీంతో తన కూతురు సినీ ఇండస్ట్రీ ఎంట్రీపై రోజా క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం నా కూతురు చదువుతోంది. తన దృష్టి మొత్తం చదువు మీదనే.

roja gives clarity about her daughter with balakrishna son mokshagna

roja gives clarity about her daughter with balakrishna son mokshagna

Balakrishna – Roja : ప్రస్తుతం చదువు మీదనే అన్షు దృష్టి

తనకు సినిమాల్లో వచ్చే ఆసక్తి లేదు. తను వస్తా అన్నా కూడా నేనే వద్దన్నా. నా కూతురుకే కాదు.. నా కొడుకుకు కూడా అదే చెప్తాను నేను. ఇండస్ట్రీలోకి వస్తానంటే వద్దని ఏనాడో చెప్పాను. వాళ్లకు నచ్చిన పని చేసుకునే పూర్తి స్వేచ్ఛను మాత్రం నేను ఇస్తాను. అన్షుకు సైంటిస్ట్ కావాలనుంది. అంతే కానీ.. ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ గా సెటిల్ అవ్వబోతోంది అనేది పచ్చి అబద్ధం. తనకు ఆ ఆసక్తి కూడా లేదు అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది రోజా. అంటే.. బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో రోజా కూతురు హీరోయిన్ గా నటించడం లేదన్నమాట. మరి.. ఇలాంటి వార్తలకు ఇకనైనా చెక్ పడుతుందో చూడాలి మరి.

Advertisement
WhatsApp Group Join Now

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది