Roja : ఎన్నో కష్టాలు ఎదుర్కొని స్టార్ హీరోయిన్‌గా రోజా ప్రయాణం.. సాగిందలా..!
Roja : తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను ఎంజాయ్ చేసిన రోజా.. ప్రజెంట్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ఉన్నారు. వైసీపీ ఎమ్మెల్యేగా ప్రజెంట్ రోజా కొనసాగుతున్నారు. రాజకీయాల్లో ఉంటూనే బుల్లితెరపై ‘జబర్దస్త్’ ఇతర ఫెస్టివల్ ఈవెంట్స్‌లో రోజా కనబడుతున్నారు. కాగా, రోజా స్టార్ హీరోయిన్‌గా ఎదగడానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా తిరుపతిలో నాగరాజురెడ్డి, లలితా దంపతులకు జన్మించన రోజా..పద్మావతి యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. హీరోయిన్ కాకముందు కూచిపూడి డ్యాన్సర్‌గా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిన రోజా..కూచిపూడి డ్యాన్సర్‌గా మంచి పేరు సంపాదించుకుంది.
దివంగత మాజీ ఎంపీ, సీనియర్ నటుడు శివప్రసాద్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ప్రేమ తపస్సు’ సినిమాతో రోజా సినీ ప్రయాణం స్టార్ట్ అయింది. అయితే, రోజా ఒరిజినల్ నేమ్ శ్రీలతరెడ్డి. కాగా, ఆమె పేరును రోజాగా మార్చేశాడు దివంగత నటుడు శివప్రసాద్. అయితే, రోజా వెండితెరపైన తొలిసారి కనబడింది ‘ప్రేమ తపస్సు’ చిత్రంలో కాదు.. ‘సర్పయాగం’ సినిమా ద్వారా వెండితెరపైన తొలిసారి మెరిసింది రోజా. ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘సీతారత్నం గారి అబ్బాయి’ సినిమాతో రోజా కెరీర్ టర్న్ అయింది. అప్పటి వరకు రోజా ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. అవకాశాలు కోసం ఎదురు చూసి.. ప్రయారిటీ లేని రోల్స్ సైతం సినిమాల్లో ప్లే చేసింది రోజా.

roja faced so many difficulties for becoming star heroine
Roja : అవమానాలను దిగమింగుకుని.. ముందుకు సాగిన రోజా..
కాగా, ‘సీతారత్నం గారి అబ్బాయి’ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత రోజా దశ, దిశ మారిపోయిందని చెప్పొచ్చు. సినీ అవకాశాల కోసం ఆమె వెతుక్కోవాల్సిన పని లేకుండా పోయింది. వరుస అవకాశాలు ఆమెనే వెతుక్కుంటూ వచ్చాయి. ‘ముఠా మేస్త్రి, గాండీవం, శుభలగ్నం, ముగ్గురు మొనగాళ్లు, భైరవద్వీపం, బొబ్బిలి సింహం’ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది రోజా. ఈ క్రమంలోనే తమిళ్ డైరెక్టర్ సెల్వమణిని మ్యారేజ్ చేసుకుంది రోజా. ప్రజెంట్ అటు పాలిటిక్స్ ఇటు సినిమా రంగం రెండిటినీ బ్యాలెన్స్ చేస్తోంది వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా.