Roja : నానికి కిరాణం బిజినెస్ బెస్ట్.. రోజా సంచలన కామెంట్స్..
Roja : ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్స్‌లో సినిమా టికెట్స్ ధరల వ్యవహారంపై వివాదం రోజురోజుకూ ఇంకా ఎక్కువవుతున్నది. టికెట్స్ ప్రైసెస్ విషయమై ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలని టాలీవుడ్ సినీ పెద్దలు కోరుతున్నారు. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్యలతో మాటల యుద్ధం మొదలైంది. నాని వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, వైసీపీ నేతలు కౌంటర్స్ ఇస్తున్నారు. తాజాగా నాని వ్యాఖ్యలపై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించింది.తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా.. నాని వ్యాఖ్యలపై స్పందించింది.జగన్ సర్కారు పేదల కోసం పని చేస్తున్నదని, సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తుందని చెప్పింది.
ఇకపోతే సినిమా థియేటర్స్‌లో టికెట్ల ధరలను ప్రభుత్వం నిర్ణయించడం సరి కాదని పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఆ దిశగానే వెళ్తున్నది. ఈ క్రమంలోనే హీరో నాని మాట్లాడుతూ టికెట్స్ ధరలు తగ్గించడమంటే సినీ ప్రేక్షకులను అవమానించడమేనని, మూవీ థియేటర్స్ కలెక్షన్స్ కంటే కూడా కిరాణా వ్యాపారం కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపైన ఇప్పటికే వైసీపీ మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్, బొత్సా సత్యనారాయణ స్పందించారు. తాజాగా రోజా స్పందించారు.సినిమా థియేటర్స్ కంటే కూడా కిరాణా వ్యాపారమే బాగుందని పేర్కొన్న అదే పని చేసుకోవాలని చెప్పి ఫైర్ అయింది నగరి ఎమ్మెల్యే రోజా.

roja comments on hero nani
Roja : వారి వల్ల ఇండస్ట్రీకి తీవ్ర నష్టమంటున్న రోజా..
నాని వ్యాఖ్యల వలన సినీ ఇండస్ట్రీకి నష్టం జరుగుతున్నదని తెలిపింది. ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు నాని చేయడం టాలీవుడ్ ఇండస్ట్రీకి మరింత నష్టమని, కొంత మంది రాజకీయ ఉనికి కోసం పార్టీలు పెట్టారని, వారి వలన ఇటువంటి వివాదాలు వస్తున్నాయని విమర్శించింది రోజా. రోజా వ్యాఖ్యలతో ఈ సినిమా టికెట్స్ ధరల విషయం ఇంకా రచ్చ రచ్చ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. రోజా కౌంటర్ పైన నాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. ఇకపోతే థియేటర్స్‌లో సినిమా టికెట్స్ ధరలను ఏపీ సర్కారు నిర్ణయించడాన్ని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తప్పుబట్టారు.