Samantha : రష్యా డాక్టర్ చెప్పిన బిగ్ నిజాలు… సమంతకి వ్యాధి వల్ల భవిష్యత్తులో ఆమె జీవితం ఇలా???
Samantha : సమంత నాగచైతన్య తో విడిపోయాక మీడియాకి దూరంగా ఉండిపోయింది. తన కొత్త మూవీ యశోద ప్రమోషన్స్ లో కూడా ఎక్కువగా కనిపించడం లేదు. దీంతో ఆమె అమెరికాలో సర్జరీ చేయించుకుంటుందని అందరూ అనుకున్నారు. అయితే వీటన్నింటికీ పుల్ స్టాప్ పెట్టేస్తూ తనకి మయోసైటిస్ వ్యాధి ఉన్నట్లు సమంత ప్రకటించింది. ఈ వ్యాధికి గత కొన్ని నెలలుగా చికిత్స తీసుకుంటున్నట్లు కూడా తెలిపింది. దీంతో సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. అయితే అసలు మయోసైటిస్ వ్యాధి అనేది ఏంటి? అది అంత ప్రమాదకరమా అని కొందరు శోధిస్తున్నారు. దీంతో ఈ వ్యాధిపై కొందరు వైద్యులు స్పందించారు.
ఆటో ఇమ్యూన్ కారణంగా శరీరంలో ఏర్పడే కొన్ని లక్షణాల కలయికను మయోసైటీస్ అని పిలుస్తారు. దీనివలన కండరాలు బలహీనంగా అయిపోతాయి. అలాగే త్వరగా అలసిపోవడం, నొప్పి ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ వ్యాధి రకరకాలుగా ఉంటుంది. అందులో సమంతకు వచ్చిన వ్యాధి ఏమిటో ఆమె స్పష్టం చేయలేదు. మయోసైటిస్ లో పాలిమయోసైటీస్ అనే వ్యాధి ఒకటి. ఈ వ్యాధి వస్తే కండరాల నొప్పి ఎక్కువగా ఉంటుంది. ఏ చిన్న పని చేసిన తొందరగా అలిసిపోతారు. ఒక్కోసారి వారికి తెలియకుండానే కింద పడిపోతారు. ఇక రెండో రకం డెర్మటోమయోసైటిస్. ఇది పిల్లలు, మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చర్మంపై దద్దుర్లు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక మూడో రకం క్లూజన్ బాడీ మయోసైటిస్.
దీని వలన భుజాలు, నడుము, తొడ, కండరాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. ఈ వ్యాధి వలన ముంజేతి, మోకాలి కండరాలు ప్రభావితం అవుతాయి. నొప్పి బాగా ఉంటుంది. దీని వలన నీరసానికి ఎక్కువగా గురవుతారు. ఇది ఎక్కువగా 50 ఏళ్లు దాటిన వారికి వస్తుంది. మయోసైటీస్ వ్యాధిని గుర్తించడం చాలా కష్టమని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి కొంతమందికి వంశపారపర్యంగా కూడా వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ఈ వ్యాధికి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ లేదు. ఉపశమనానికి మందులు మాత్రమే ఉన్నాయి. కానీ తమ జీవనశైలిలో మార్పులు ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ కాలం జీవించవచ్చని చెబుతున్నారు. ఇది పాటించకపోతే ఐదేళ్లలోపే పేషెంట్ మరణించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సమంత యుక్త వయసులో ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ మెడిసిన్ వాడితే త్వరగా కోలుకునే అవకాశం ఉంది.