Samantha : ఆ నొప్పి, బాధను ఆరేళ్లు భరించా.. సమంత ఎమోషనల్
Samantha : సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ బిజీగా ఉంటోంది. తన అభిమానులకు నిత్యం ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. తన పనులతో సమంత ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాను వాడుతూ ఉంటుంది. అలాంటి సమంత తాజాగా తన అభిమానులతో చాలా రోజుల తరువాత ముచ్చటించింది. ఇందులో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమంత సమాధానం ఇచ్చింది.మామూలుగానే సమంత తన సినిమాలు, వ్యాపారాలు, పర్సనల్ వ్యవహారాలు, ఫ్రెండ్స్, పార్టీలు అంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది.
మరో వైపు శాకుంతలం డబ్బింగ్‌ను కూడా పూర్తి చేసేసింది. అంతుకు ముందు కాథువాక్కుల రెండు కాదల్ షూటింగ్, డబ్బింగ్‌ను పూర్తి చేసేసింది. ఇక ఇప్పుడు యశోద షూటింగ్ కోసం సమంత ఎదురుచూస్తోంది. అయితే సమంత మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉంటుంది.తన పెట్స్ గురించి, వర్కవుట్ల గురించి షేర్ చేసే వీడియాలు తెగ వైరల్ అవుతుంటాయి. సాషా, హష్‌ల గురించి సమంత పెట్టే పోస్టులకు సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. అయితే తాజాగా సమంత ఓ విషయం గురించి చెప్పింది.

Samantha About peircings
చెవులు కుట్టించుకున్నావ్ కదా? నీకు ఎలా అనిపించింది అంటూ సమంతను అడిగేశాడు. సమంత చెవులు కుట్టించుకున్న విషయాన్ని చూపిస్తూ అసలు విషయం చెప్పింది.చెవి భాగంలో రెండు మూడు చోట్ల కుట్టించుకుంది. కాథువాక్కుల రెండు కాదల్ సినిమా కోసమే ఇలా చేసినట్టుంది. అయితే అది ఎంతో బాధగా అనిపించిందట. ఆ నొప్పి ఆరు నెలల వరకు పోలేదట. ఎంతో కష్టంగా అనిపించిందని సమంత చెప్పుకొచ్చింది.